రైతులకు ఎంత ఇచ్చినా ‘రుణం’ మాఫీ తీరదు

తెలంగాణ హోమ్

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)
రైతులకు రుణమాఫీ చేయడానికి అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా మీనమేషాలు లెక్కిస్తుంది.రుణమాఫీ చేయడం గొప్ప ఆదర్శమని ప్రచారం చేసుకుంటాయి ప్రభుత్వాలు.కాని అన్నదాతలైన రైతులకు ఎంత మాఫీ చేసినా వారి రుణం తీరదు.అది గుర్తించుకోవాలీ ప్రభుత్వాలు.అధికారం లోకి రావడానికి ముందు మాటేకదా అని హామీలు ఇస్తారు. మాఫీఇచ్చేనాటికి ఆపసోపాలు పడతారు.బడాబాబులు ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలను రద్దుచేస్తారు.అన్నం పెడుతున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోరు. రుణాలు,పెట్టుబడులు వద్దు,మేము పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని రైతులు,రైతుసంఘం డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవు.రైతు చట్టాల పేరుతో నల్ల చట్టాలు తెచ్చి కొన్ని ప్రభుత్వాలు వేధిస్తున్నాయి 2022మే డిక్లరేషన్లో వరంగల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ఇప్పుడు జరుగుతున్నది.రాహుల్ గాంధీ మాటను కష్టమైనా నిలబెట్టడమే మా లక్ష్యమని రేవంత్ ప్రకటించడం గమనార్హం.రేషన్ కార్డ్ లేకపోయినా రుణమాఫీ చేయాలని బ్యాంకర్లు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసారు. కేవలం కుటుంబవివరాల కోసమే రేషన్ కార్డ్ నిబంధన పెట్టామన్నారు.తెలంగాణలో 70లక్షలమందికీ బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి.రేషన్ కార్డ్ లేనివారు 6.63లక్షలమంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.జీవోలో పాస్ పుస్తకం ఆధారంగా మాఫీ ఉంటుందని ఉండగా,ఆచరణలో రేషన్ కార్డ్ ఆధారంగా అంటున్నారని,జీవోని మార్చాలికదా అని బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం గమనార్హం.అలాగే పాస్ పుస్తకంతో రుణాలు తీసుకుంటే ఇప్పుడు రేషన్ కార్డ్ చూసి మాఫీ చేస్తామని చెప్పడం మాట మార్చటమేనన్నారు.అలాగే పీఎం కిసాన్ ప్రాతిపదిక తీసుకుంటే 39లక్షల మందికి మాఫీ జరగదని హరీష్ రావు అనడం గమనార్హం.డిప్యూటీ సీఎం భట్టి రేషన్ కార్డ్ లేనివారికీ రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు.అప్పుల్లో ప్రభుత్వాన్ని అప్పజెప్పితే తాము రుణమాఫీ కోసం ప్రతిపైసా జాగర్త చేసి మాఫీ చేస్తున్నామన్నారు.ఒకేసారి చేయడం కష్టమని మూడుసార్లలో చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వెనుక కొద్దిగా తెలివి ప్రకటించింది.గురువారం రూ.లక్ష రూపాయల లోపు రుణమాఫీ జరుగుతుందని ప్రకటించింది ప్రభుత్వం. ఆ మేరకు రూ ఏడు వేల కోట్లు విడుదల చేసామన్నారు.ఈ నెలాఖరులోపు లక్షన్నర వారికి,ఆగస్టులో రూ.2లక్షలలోపు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.మొత్తం రుణమాఫీకీ రూ.31వేల కోట్లు సిద్ధం చేశామని ప్రభుత్వం ప్రకటించడం విశేషం.2004లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రుణమాఫీకి రూ. 72వేలకోట్లు విడుదల చేయగా ఇప్పుడు కేవలం ఒక్క తెలంగాణలో రూ.31వేల కోట్లు ఖర్చు చేస్తున్నది.ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం.చేస్తున్నాం.వ్యవసాయం దండుగకాదు..పండుగ అని రుజువుచేస్తామని రేవంత్ చెప్పడం విశేషం. ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుకు రూ.30వేలకోట్లు ఖర్చుచేసింది.