(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)
ఒకపక్క అసెంబ్లీ,లోకసభ ఎన్నికల్లో పరాజయాలు మరోపక్క తన ప్రియమైన బిడ్డ కవితకు బెయిల్ రాకపోవడంతో కేసీఆర్ ఏమి చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. కవితపై సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేయడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. బీజేపీతో పొత్తు పెట్టూకోవడం ద్వారా లైన్ క్లియర్ చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావడంలేదు. మరోపక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు కూడా కాంగ్రెస్ బాట పట్టడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. కాంగ్రెస్ కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేయాలని పావులు కదుపుతున్నదని వస్తున్న వార్తలు మరింత భయపడుతున్నాయి.ఎట్లాగైనా కవితను విడిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా కేటీఆర్, హరిష్ రావులు కృషి చేస్తున్నారు. మొత్తం బీఆర్‌ఎస్ ను బీజీపీ లో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నా నమ్మశక్యంకాలేవు. కాని బీజేపీ,బీఆర్‌ఎస్ లు కలసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే ప్రణాళిక చేస్తున్నాయని మరో ప్రచారం వైరల్ అవుతోంది. దానికి సీఎం రేవంత్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం ద్వారా ఎదురుదాడి ప్రారంభించారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరో నలుగురు చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ దెబ్బకు కేసీఆర్ కంగాళీ అవుతున్నారు. అంతేకాక త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ, కేసీఆర్ ప్రకటనలు కూడా రేవంత్ ను అప్రమత్తం చేస్తున్నది. ఎలాగైనా కవిత విడుదలకు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చే ఒప్పందం కుదిరిందని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఢల్లీికి కేటీఆర్, హరిష్ స్వయంగా వెళ్లి బీజేపీ నేతలతో మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో నిజం ఎంత అనేది తెలియడంలేదు. కాని స్థానిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసమే వెళ్లారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెసును ఇరుకున పెట్టడానికి బీజేపీ పొత్తుకు అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అండ ఉంటే కేసుల నుంచి రక్షణ లభిస్తుందని బీఆర్‌ఎస్ ఆశ.బీజేపీ బీఆర్‌ఎస్ పట్ల విముఖత ఉండడానికి గతంలో ఆయన చూపిన మొండితనం కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ నేత బిఎల్ సంతోష్ తో పెట్టుకున్నారు.సంతోష్ అరెస్టువరకూ వెళ్లారు.ఆ తరువాత బెయిల్ పై వచ్చిన సంతోష్ ఇప్పుడు బీఆర్‌ఎస్ దోస్తుకు అడ్డుపడుతున్నారని తెలుస్తున్నది. అయినా తెలంగాణలో తమకు సొంత బలం ఉండగా దెబ్బతిన్న బీఆర్‌ఎస్ తో పొత్తు వల్ల ప్రయోజనం లేదని బీజేపీ భావిస్తున్నది. ఎటుచూసినా బీఆర్‌ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.ఏమిచేయాలో అర్ధంకాక, కవితను ఎలా జైలు నుంచి బయటపడేయాలా తెలియక తల పట్టుకుంటున్నది.