వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా ఆయన డెమోక్రట్రిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది. దానికి తోడు ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.