మాటకు కట్టుబడి ఉండడం మా నైజం
వైరాలో చివరి విడత రుణమాఫీకి శ్రీకారం
మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సృజనక్రాంతి/ఖమ్మం : రుణమాఫీ చేయలేరని.. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేసిన హరీశ్‌రావు వెంటనే రాజీనామా చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ అమలు చేశాం.. హరీశ్‌రావు రాజీనామా చేయాలి లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. లేదా అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు హరీశ్‌రావు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మూడో విడత రైతు రుణమాఫీ సందర్భంగా.. ’సాగుకు జీవం.. రైతుకు ఊతం’ పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని.. చీము, నెత్తురు ఉంటే హరీష్ రాజీనామా ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ఛాలెంజ్ చేశారు. రాజీనామా చేస్తే సరే.. లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. అంతేకాదు.. ’ హరీష్‌రావు రాజీనామా చెయ్యి.. మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా. సిద్దిపేటలో హరీష్‌ను ఓడిరచే బాధ్యత నాది. బీఆర్‌ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయ్యింది. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం’ అని ఈ సభావేదికగా రేవంత్ మరో ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల అయ్యాయి. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా రుణమాఫీ చేసినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నామని గర్వంగా చెబుతున్నానన్నారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ కానుంది. శుక్రవారం నాడు రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కానుంది. ఇప్పటికే 2 విడతల్లో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ కాగా.. 2 విడతల్లో రూ.12 వేల కోట్లు రుణమాఫీ చేసింది రేవంత్ సర్కార్. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ధీమాగా చెప్పారు సీఎం. దేశానికి స్వాతంత్యర్ర తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ మాట ఇచ్చారని.. రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేస్తున్నామని సభావేదికగా రేవంత్ ప్రకటించారు. బ్యాంకుల నుంచి రైతులకు విముక్తి కలిగించాం. రైతులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేశాం. ఎంతమంది అడ్డుపడినా రుణమాఫీ అమలు చేశాం. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా బీఆర్‌ఎస్ బుద్ధి మారలేదు. ప్రజలే తప్పు చేశారన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు’ అని రేవంత్ కన్నెర్రజేశారు. వరంగల్ వేదికగా తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన హావిూ మేరకు రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేశాం. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతురుణాలను మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఇవాళ రెండు లక్షల వరకు మాఫీ చేసింది. రైతుల ఖతాల్లో 18 వేల కోట్లు డబ్బులు జమ చేసింది. ఖమ్మం జిల్లా వైరాలో బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు.. ఆ వెంటనే రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి.
ఆగస్టు 15లోపు రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే. జూలై 18న రుణమాఫీ ప్రారంభం కాగా మొదటి విడతలో 11లక్షల 34 వేల 412 మంది రైతుల ఖతాల్లో 6 వేల కోట్లు రుణమాఫీ చేశారు. రెండో విడతలో 6లక్షల40 వేల 823 మంది రైతుల ఖాతాల్లో 6 వేల 90 కోట్లు జమ అయ్యాయి. మొత్తం రెండు విడతల్లో కలిసి 17లక్షల 75 వేల235 మంది రైతులకు లబ్ది చేకూరింది. రెండు విడతల్లో కలిసి మొత్తం 12 వేల 224 కోట్లు జమ చేశారు. ఇవాళ మూడో విడత లక్షన్నర నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశారు. మూడు విడుతల్లో కలిసి 31 వేల కోట్లు రుణమాఫీ చేసింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇచ్చినమాట నిలబెట్టు కున్నామని అన్నారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచేందుకే ఈ ప్రాంతానికి వచ్చా. 2026 పంద్రాగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. రెండు పడక గదుల ఇళ్ల పేరిట కేసీఆర్ మోసం చేశారు. మేం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. ఆరు గ్యారంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నాం అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సాధ్యం కాదన్న 2లక్షల రుణమాఫీ చేసిచూపించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగిన రోజు అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఛాలెంజ్ చేసి ఆగస్టు 15నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పాం… చేసి చూపించామన్నారు. గత సర్కార్ నాలుగు దఫాలుగా ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పదేళ్లలో బీఆర్ ఎస్ సర్కార్ లక్ష రుణమాఫీ కూడా చేయలేదన్నారు. పదేళ్లలో వేలకోట్లు ఖర్చు చేసి సీతారామ ప్రాజెక్టు కట్టారు.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. రూ. 30వేల కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను రూ లక్షా 30వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కవిూషన్లకోసమే ఇందిర, రాజీవ్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని భట్టి చెప్పారు.