‘‘స్నేహం దేవుడిచ్చిన వరం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా’’ అన్న మహాకవి వాక్యం స్నేహం యొక్క ప్రాముఖ్యతను చాటుతుంది. భారతదేశంలో రామాయణం మహాభారత కాలం నుండి స్నేహం యొక్క ప్రాధాన్యత స్నేహం యొక్క ప్రభావం సమాజంపై ఉన్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి.
స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారి కోసం ప్రాణాలు సైతం సమర్పించిన ఆధారాలు ఉన్నాయి. స్నేహం అనగానే కృష్ణుడు’ కుచేలుడు రాముడు’ సుగ్రీవుడు గుర్తుకొస్తారు. అలాంటి మధురమైన స్నేహాలు మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి.
అమ్మ తర్వాత స్థానం స్నేహా నిదే అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను పంచే ఏకైక పదం స్నేహం . స్నేహం దేవుడిచ్చిన వరం. మంచి స్నేహితుని ఎంచుకో భద్రంగా జీవితాన్ని సంతోషంగా గడుపుకో .స్నేహం అద్భుతమైంది .చీకట్లో దారి దీపం స్నేహం. వంచన ఎరుగనిది. త్యాగాల నిది స్నేహ నిది.
స్నేహం నిజమైన ఆస్తి
నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు . స్నేహానికి ఎల్లలు లేవు .అది సరిహద్దులను చేరిపివేస్తుంది . స్నేహానికి కులం ‘మతం’ రంగు లింగభేదం ‘ప్రాంతాలు ‘అడ్డురావు. స్నేహం విశ్వవ్యాప్తమైంది.
స్నేహితుడు గురువు
స్నేహితుడు గురువులా బోధించి మంచి చెడు విచ్చక్షణా జ్ఞానాన్ని అందించి మంచి వైపు నడిపించే మార్గదర్శి. తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మనో ప్రశాంతతకు దివ్య ఔషధం స్నేహం. కష్ట కాలంలో కలత చెందిన మనసుకు ప్రశాంతత కలిగించే దివ్య ఔషధం స్నేహం. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. మనోధైర్యానికి మంచి మిత్రుడు తోడు నీడగా వుంటాడు. మనలో సంకల్పాన్ని కర్తవ్యనిష్ఠను ప్రేరేపించి కార్యోన్ముఖులను చేయడానికి సలహాదారుడు స్నేహితుడు. స్నేహితుడు మనలను ప్రగతి పదం వైపు నడిపించే బాటసారి. కల్లా కపటం ఎరుగని స్నేహం కలకాలం నిలిచి ఉంటుంది.
స్నేహం మనం
స్నేహంలో ‘‘నేను’’ ‘‘ నాది ‘‘అనే ‘‘అహం’’ ఉండదు. మనం అనే అందమైన అనుభూతి స్నేహం. జీవితం స్నేహం జీవితమనే ఉద్యానవనం లో అందమైన పుష్పం స్నేహం. హృదయపు తలుపులను ఒక సారి తడితే మాధుర్యం అంతా హృదయములో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించనిది స్నేహ బంధం స్నేహం మొగ్గలా ప్రారంభమై మహా వృక్షంలా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది.
స్నేహం తరతరాల వారిథి
ఇద్దరు వ్యక్తులకు ఇరువురి మనసులకు సంబంధించిన స్నేహం తర తరాలకు తీపిని పెంచుతుంది . కుటుంబాల మధ్య ఆత్మీయత’ ప్రేమ ‘ అనుబంధాలు అనురాగాలు ‘ అభిమానం పెంచే వారధి స్నేహం.
బంధాల పటిష్టత స్నేహం
కుటుంబాల మధ్య ఆత్మీయత అనురాగం’ అభిమానం సహాయం ‘సహకారం ఆదరణ’ గౌరవం పటిష్ఠమైన సంబంధాలను బలోపేతం చేస్తుంది. సమ కాలీన సమాజ మార్పులకు కాలానికి అతీతంగా మైత్రి మధురిమ ను పెంచుతుంది .
కష్ట సుఖాల్లో అండ స్నేహం
కన్న వారితో కట్టుకున్న వారితో తో బట్టువులతో చెప్పుకో లేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం స్నేహం గొప్పదనం .కష్ట సుఖాల్లో అండగా ఉండేవారు నిస్వార్థంగా సాయం అందించే వారు నిజమైన మిత్రులు.
‘‘స్నేహం అనేది వివరించడం కష్టం. స్నేహం స్కూల్లో నేర్చుకునేది కాదు. స్నేహం యొక్క అర్థం నేర్చుకోక పోతే
మీరు ఏమినేర్చుకోలేరు.
మహమూద్ అలీ-
స్నేహం ఓ మధురానుభూతి. వయసుతో నిమిత్తం లేదు ఆట పాటలాడే బాల్యం నుండి వృద్ధ్యాప్యం వరకు అందరిలో స్నేహ భావంతో వుంటుంది. స్నేహాను భూతిని అనుభవిస్తే తెలుస్తుంది. ఆస్వాదిస్తే అర్థం అవుతుంది.
సృష్టి స్నేహం సృష్టిలో నా అనే వారు బంధువులు లేని వారు ఉంటారేమో కానీ స్నేహితులు లేని వారు ఉండరు. ఇంట్లో చెప్పుకోలేని సమస్యలు బాధలు స్నేహితులతో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని మనసుకు కలిగిన ఒత్తిడిని తగ్గించూ కుంటారు. ఓదార్పు పొందుతారు. జీవితాన్ని ఆశావహ దృక్పథం వైపు మళ్ళించే గొప్ప శక్తి స్నేహానికి వుంది.
,స్నేహం ప్రకృతి స్నేహం ప్రకృతి వంటిది. అది అహల్లాధంతో పాటు అనందాన్ని హాయిని ఇస్తుంది. కష్టాల్లో నేను ఉన్నాను అని బరోసా ఇస్తుంది. జీవన ప్రయాణంలో స్నేహం శ్వాస వంటిది. స్నేహం తీయనైనది.మనిషి జీవితంలో అమ్మ ప్రేమ మొదటి స్థానం స్నేహం రెండవ స్థానాన్ని దక్కించుకుంది. స్నేహితులతో కలిసి వుంటే కలిగే సంతోషం సంతృప్తి ఆనందం విలువైనది.మార్కెట్లో కొంటె దొరకనిధి స్నేహ%శీ%. స్వచ్ఛత నమ్మకం సత్యసందత మంచి ప్రవర్తన పారధర్శనికత జవాబీదారితనంతో ‘‘మన’’ అనే ఆత్మీయత భావనతో కూడినది. పవిత్రమైనది స్నేహం. స్నేహం జీవితానికి ఆనందాన్నిఇస్తుంది.ఆంధోళనను తుంచి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పెంచి ఆరోగ్యానికి ఉత్సాహానికి’ ఉల్లాసానికి ఉత్ప్రేరకంగా నిలుస్తుంది.
20శ ‘హాల్ మార్క్ కార్డు సృష్టికర్త జూయిస్ పాల్ ఈ రోజును స్నేహానికి గుర్తుగా జరుపుకోవడంప్రారంభించారు
స్నేహితుల కోసం జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఐ’రా’స2011 నుండి నిర్వహిస్తుంది.
సభ్య దేశాల్లో ప్రపంచ స్నేహితుల దినోత్సవం గురించి సదస్సులు సమావేశాలు నిర్వహిస్తుంది.స్నేహితులతో గడిపిన సమయం జీవితంలో స్నేహం విలువ’ స్నేహం నిర్వహించే బహుముఖ పాత్ర గుర్తించి’ స్నేహ సంబంధాల ప్రాధాన్యత గురించి అవగాహన చైతన్యం కలిగిస్తుంది. ఈరోజు స్నేహితులతో గడపడం. బహుమతులిచ్చుకోవడం. స్నేహపూర్వక సందేశాలు పంచుకోవడం. స్నేహం విలువను చాటే కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రపంచ దేశాల మధ్య స్నేహ ‘సౌభ్రాతృత్వ సౌహార్ధతతో ‘కూడిన శాంతి ‘సహనం’ సంఫీుభావం’ సామరస్య వాతావరణాన్ని సృష్టించి ప్రపంచ్చాన్ని వసుదైక కుటుంబంగా ఎదగడాని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం దోహద పడుతుందని ఆశిధ్దాం.
(జూలై 30 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం)
నేదునూరి కనకయ్య, అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం, కరీంనగర్
9440245771