తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్‌ జరీన్‌ శుభారంభం

క్రీడలు

భారత బాక్సర్‌, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్‌ జరీన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల బాక్సింగ్‌ ఈవెంట్‌లో 5-0తో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాను మట్టికరిపించింది. ఈ విజయంతో నిఖత్‌ జరీన్‌ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో నిఖత్‌ జరీన్‌ టాప్‌ సీడెడ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌, చైనా బాక్సర్‌ వు యుతో తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *