నైనీ బ్లాక్‌లో వేగంగా బొగ్గు తవ్వకాలు

తెలంగాణ

నాలుగు నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలి
అధికారులకు డిప్యూటి సిఎం భట్టి ఆదేశాలు
సృజనక్రాంతి/హైదరాబాద్‌: సింగరేణి సంస్థకు ఒడిశాలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. నాలుగు నెలల్లో గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశర చేశారు. బుధవారం సచివాలయంలో ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌ బలరామ్‌, ఇతర అధికారులతో ఆయన సవిూక్ష నిర్వహించారు. నైనీ బొగ్గు బ్లాక్‌పై చర్చించారు. సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్ఠను పెంచేలా మైనింగ్‌ చేపట్టాలన్నారు. స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని కోరారు. ఒడిశా రాష్ట్ర అటవీ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపాలని సింగరేణి సంస్థను ఆదేశించారు. నైనీ బ్లాక్‌ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలి. హైటెన్షన్‌ విద్యుత్తు లైన్‌ను వెంటనే నిర్మించే విధంగా ఒడిశా విద్యుత్‌ శాఖతో సంప్రదిస్తూ ముందుకు సాగాలి. పునరావాస, నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్‌పీడీఏసీ విూటింగ్‌ను అతి త్వరగా పూర్తి చేసుకోవాలి. 2015లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్‌ను కేటాయించినప్పటికీ గత ప్రభుత్వ నిరాసక్తత వల్ల ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సింగరేణిపై ఉన్న ప్రత్యేక చొరవ కారణంగా నేను స్వయంగా ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అన్ని సమస్యల పరిష్కారానికి చర్చించాను‘ అని భట్టి విక్రమార్క తెలిపారు. సమావేశంలో సంస్థ సీఎండీ ఎన్‌ బలరామ్‌ మాట్లాడుతూ.. సమావేశంలో సూచించిన ప్రకారం ప్రతి పనికి నిర్దేశిత కాలపరిమితిని విధించుకొని పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *