సంయమనం పాటించాలని విూడియాకు సూచన
జడ్జిల పేర్లు, ఫోన్ నంబర్లు వెల్లడిరచవద్దని ఆదేశాలు
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని సూచించింది. అలాగే తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది. రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని పత్రికల్లో కథనాలు రావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్టు కౌంటర్‌లో పేర్కొంది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు తెలిపింది. ఈ వ్యవహారంపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విూడియా కూడా సంయమనం పాటించాలని, ట్యాపింగ్‌కు గురైన జడ్జిల వివరాలను వెల్లడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు కీలక విషయాలను రాబట్టారు. అందులో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని నింధితులు విచారణలో ఓప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు గురైన జడ్జీల పేర్లు ఎక్కడ వాడొద్దు. వారి ఫోన్ నెంబర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోటోలు బహిర్గతం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసరంగా రాద్దాంతం చేయొద్దు అని విూడియా సంస్థలను హైకోర్టు ఆదేశించింది. అనంతరం.. ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 23కి వాయిదా వేసింది.