డైలమాలో పడ్డ బీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్
ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరికతో విస్మయం
సృజనక్రాంతి/హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనాటికి ఎమ్మెల్యేల బలం పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా పథకాలు రచిస్తోంది. అందులో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బీఆర్‌ఎస్ ను మానసికంగా బలహీనంగా మార్చేస్తోంది. కనీసం ఆ పార్టీ నుంచి ఎవరెవరు కాంగ్రెస్ లో చేరుతున్నారో కూడా తెలియనీయకుండా..లీకులకు బ్రేకులు వేసి మరీ చేర్చుకుంటోంది. సొంత పార్టీ నేతలే ఒకరిని ఒకరు అనుమానాస్పదంగా చూసుకునే పరిస్థితి ఏర్పడిరది బీఆర్‌ఎస్ కు. అసలేం జరుగుతోందో తెలియని డైలమాలో ఉంది ఆ పార్టీ క్యాడర్ మొత్తం. ఇలాంటి పరిస్థితిలో బీఆర్?ఎస్?కు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా కూడా హడావుడి లేకుండా, ఎలాంటి ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఎమ్మెల్సీల చేరిక జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్?తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాసు మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఉన్నారు. ఇకపై కంటిన్యూగా జాయినింగ్స్ ఉంటాయని టీపీసీసీకి చెందిన నేతలు చెబుతున్నారు.. తమ టార్గెట్ 25 మంది ఎమ్మెల్యేలని, ఇప్పటికే ఆరుగురు చేరగా, త్వరలో మిగతా వారంతా చేరుతారని చెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో కలుపుకుంటే ప్రస్తుతం అధికార పార్టీ సభ్యుల సంఖ్య 71కి చేరుకుంది. కాగా తెలంగాణ శాసన మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆరుగురు మాత్రమే సభ్యులు న్నారు. తాజాగా ఆరుగురు సభ్యులు చేరడంతో వారి బలం 12కు చేరింది. వామపక్ష ఎమ్మెల్సీ మద్దతుతో కలిపితే 13కు చేరుతుంది. కాంగ్రెస్ పార్టీకి మరో ఐదారు సీట్లు ఉంటే మండలిలో కూడా మెజారిటీ దక్కుతుంది. ప్రస్తుతం తెలంగాణ మండలిలో బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. కీలక బిల్లులను నెగ్గించుకునే రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే వీలుంటుంది. బీఆర్?ఎస్? ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్, దండె విఠల్, ఎం.ఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్ సమావేశమైన వారు రాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. సీఎం ఢల్లీి నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం చకచకా పూర్తవడం గమనార్హం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని గత కొన్ని రోజుల నుంచి పొలిటికల్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఫలానా ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారంటూ మీడియా సర్కిళ్లలోనూ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ పార్టీ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలతో ఎవరు, ఎప్పుడు పార్టీ చేంజ్ అవుతున్నారనే విష యం ఇటు పబ్లిక్‌తో పాటు పార్టీ నేతలకూ తెలియ డం లేదు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ప్రతిపక్ష పార్టీలకు చిక్కకుండా అమలవుతున్నాయని కాం గ్రెస్ పార్టీ నేతలు సంతోష పడుతున్నారు. తాను పార్టీ మారడం లేదని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దానం నాగేందర్.. ఆ మరుసటి రోజే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన తాను కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయనని చెప్తూనే భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ గా చెప్పిన పోచారం శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ కండుమా మార్చుకున్నారు. ఇలా మొదటినుంచి తాము పార్టీ మారమని చెబుతూనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో.. తెలియడం లేదు.