పలు జిల్లాల్లో నమోదువుతన్న కేసులు
సృజనక్రాంతి/హైదరాబాద్/విజయవాడ : ఉభయ తెలుగు రాష్టాల్ల్రో డెంగ్యూ కేసులు పెరుగు తున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు అన్న తేడా లేకుండా కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ కేసుల న మోదును తెలయి పర్చాలని ఆరోగ్య శాఖ కూడా ఆదేశించినట్లు సమచారం. వర్షా కాలం కావడంతో పాటు ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయి. అవే ఇప్పుడు.. దోమలకు ఆవాసాలుగా మారనున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ దోమలు గుడ్లు పెట్టేందుకు ఇదే సరైన సమయం. నిలిచిన నీరు, అధిక తేమ ఏడిస్ దోమ వృద్ధికి కారణమవుతాయి. ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిలబడకుండా జాగ్రత్తపడాల్సిందే. దీనికితోడు పారిశుధ్యం సక్రమంగా సాగడం లేదు. కాలం మారుతోన్న కొద్ది డెంగ్యూ కూడా మరింతగా బలోపేతం అవుతోదని, మరింత ప్రమాదకరంగా మారుతోందని డాక్టర్లు చెబుతున్నారు. డెంగ్యూ వస్తే జ్వరం ముదిరి రక్తంలో క్రమేనా ప్లేట్లెట్స్ పడిపోవడం మొదలవుతుంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ కానట్లయితే.. ప్రాణాలకే ముప్పు. అయితే, ఈ వైరల్ ఫీవర్ మనకు తెలియకుండానే మరో నష్టాన్ని కలిగిస్తోంది. నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, ఢల్లీి, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్టాల్ల్రో కేసులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంగ్యూ సాధారణ ఫ్లూ లక్షణాలను కలిగి ఉన్నా.. అది నాడీ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఎన్సెఫాలిటిస్, మెనింజైటిస్, మైలిటిస్.. మెదడు, వెన్నుపాము వాపుకు కారణమవుతాయి. ఫలితంగా డెంగ్యూ రోగులు తరచు తలనొప్పితో బాధపడతారు. అలాగే వారి మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి. కొందరు కోమాలోకి జారుకోవచ్చు. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గినప్పుడు శరీరంలోని వివిధ భాగాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. చివరికి మెదడులో కూడా రక్తస్రావం జరిగి.. పరిస్థితి మరింత దిగజారే ముప్పు ఉంది. కాబట్టి, డెంగ్యూను తేలిగ్గా తీసుకోవద్దు. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చులే అనుకోవద్దు. డెంగ్యూ రోగిని హాస్పిటల్లో చేర్చి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచడం చాలా మంచిది. డెంగ్యూ సోకిన రోగిలో ప్లేట్లెట్స్ చాలా వేగంగా తగ్గిపోతుంటాయి. ప్లేట్లెట్స్ వరకు తగ్గినట్లయితే.. తప్పకుండా హాస్పిటల్లో జాయిన్ కావాలి. ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతే.. శరీరంలో రక్తస్రావం ఏర్పడుతుంది. జ్వరం వచ్చి తగ్గుతున్నట్లయితే తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. డాక్టర్ సూచన మేరకు రక్తం, ప్లేట్లెట్స్ల పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఒక వేళ ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతున్నట్లు రిపోర్టులో తేలితే.. మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం కూడా డెంగ్యూపై అప్రమత్తం కావాల్సి ఉంది.
