ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరణ
ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రాజెక్ట్
పదేళ్లు అధికారంలో ఉన్నా కెసిఆర్ ఖమ్మంను పట్టించుకోలేదు
సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో సిఎం రేవంత్ రెడ్డి
సృజనక్రాంతి/భద్రాద్రి కొత్తగూడెం : సీతారామ ప్రాజెక్ట్‌పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. తొలి పంప్‌హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్, హరీశ్‌రావు సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదని.. కవిూషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్ ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు నిధుల కోసం ఒత్తిడి చేస్తే నేను మిగతా జిల్లాల గురించి కూడా ఆలోచిస్తున్నా. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నిధుల కేటాయింపులో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వలేదు. కేసీఆర్, హరీష్ బోగస్ మాటలు చెబుతారు గనుక ఆ పార్టీ నేతలు నీళ్ళ కోసం ఆందోళన చేయలేదు. నాగార్జున సాగర్ నీళ్ళు రాకపోయినా గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టు కోసం వైరా లింక్ కెనాల్ చేపట్టాం. లింక్ కెనాల్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటపడి చేపించామని అన్నారు. మంత్రి తుమ్మలపై నమ్మకంతో నష్ట పరిహారం ఇవ్వక పోయినా లింక్ కెనాల్‌కు రైతులు భూములు ఇచ్చారు. హరీష్ రావు దూలంలాగా పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు. రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. కవిూషన్ల కోసం పంప్ మోటార్లు పెట్టారు. నాలుగేళ్లుగా పంప్ హౌస్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పంప్ హౌస్‌లో నీరు పారేలా చేశాం. కృష్ణా జలాలు రాక పోయినా ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు అందే అవకాశం ఉంది. పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో నీటి పంచాయితీ లేకుండా గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు నీరు అందిస్తాం. హరీశ్ అభినందించక పోయినా ఫర్వాలేదు కానీ అవమానించేలా మాట్లాడొద్దు. రానున్న రోజుల్లో 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను మొదటి దశ ప్రాధాన్యంగా పూర్తి చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టడానికి కొత్త అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్ట్ పంపులను ఆన్ చేయలేదన్నారు. తాము నీళ్లు చల్లుకోలేదు..గోదావరి తల్లి తమ విూద నీళ్లు చల్లిందన్నారు. నల్గొండ జిల్లాలోనూ అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు రేవంత్. పాలమూరు జిల్లాలోనూ పరిస్థితులు అలాగే ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందన్నారు. 1500 కోట్లతో పూర్తి కావాల్సిన ఇందిరా సాగర్ ప్రాజెక్టును ..18వేల కోట్ల అంచనాకు పెంచారని చెప్పారు సీఎం రేవంత్. రూ. 7500 కోట్లు ఖర్చు చేసి చుక్కనీరు గుంట భూమికి ఇవ్వలేదని ద్వజమెత్తారు. తమ మంత్రుల మధ్య ఎంతో పోటీ ఉందని.. అందుకే గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు పారించాలనే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టులను నాలుగు భాగాలుగా విభజించామన్నారు. 80 శాతం పెరిగి ..60శాతం, 4 శాతం,20 శాతం ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరినీటిని కృష్ణా పరివాహక ప్రాంతాలకు తరలించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతులు విూదుగా సీతారామ ప్రాజెక్ట్ 3వ పంప్ హౌస్ ను గురువారం ప్రారంభించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి.. ఉపముఖ్యమంత్రి భట్టిని ఆహ్వానించారు.ఆయన ప్రత్యేక పూజలు చేసి పంపి హౌస్‌ని ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురం దగ్గర మధ్యాహ్నం 12 గంటలకు సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 3 ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క చేతులు విూదుగా ప్రారంభించారు. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్ పూసుగూడెం దగ్గర రెండవ పంప్ హౌస్ ను ఈరోజు ప్రారంభించారు.సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు త్వరగా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు. ఈ పథకం కింద 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు నీరివ్వాలన్నది లక్ష్యం. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో జలయజ్ఞం కింద నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు రాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పునరాకృతిలో భాగంగా నిర్మాణంలో ఉన్న రెండు ఎత్తిపోతల పథకాల స్థానంలో ’సీతారామ’కు గత భారాస ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2016 ఫిబ్రవరి 16న రూ.7,926 కోట్లతో దీనికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. 2018లో ఈ అంచనా వ్యయం రూ.13,057.98 కోట్లకు పెరిగింది. ఇప్పటికే చేపట్టిన పనులకు పెరిగిన ధరలు, ఇంకా టెండర్లు పిలవాల్సిన డిస్టిబ్యూట్రరీ పనులకు కలిపి సుమారు రూ.18,600 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఇప్పటి వరకు రూ.7,919.65 కోట్లు ఖర్చుచేయగా సుమారు మరో రూ.పదివేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది.