స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం

బిజినెస్

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ కోఠిలోని స్థానిక ప్రధాన కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎస్‌బిఐ సిజిఎం రాజేష్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాజేష్‌ కుమార్‌ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన వీర శక్తులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సముచితమైన నివాళి అని అన్నారు. వారి త్యాగాల వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛా, ప్రజాస్వామ్య దేశంలో జీవించగలుగుతున్నామన్నారు. వారు చేసిన త్యాగాలకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు ఎంతో గర్వంగా, సంతోషంగాను ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ లేడీస్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ రష్మీ సిన్హా, ప్రకాష్‌ చంద్ర బారోర్‌, (జనరల్‌ మేనేజర్‌ ఎన్‌ డబ్ల్యూ -2), రవి కుమార్‌ వర్మ (జనరల్‌ మేనేజర్‌ ఎన్‌ డబ్ల్యూ -1), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌లు , ఇతర సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు , ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
` సృజనక్రాంతి ప్రత్యేక ప్రతినిధి