జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ దేవర కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్, టీజర్‌లకు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రెండో సింగిల్ సాంగ్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని రెండో సాంగ్‌ను ఆగస్టు 5న రిలీజ్ చేయబోతున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇది ఓ రొమాంటిక్ సాంగ్‌గా ఉండబోతుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అందాల జాన్వీ కపూర్ నడుముపై ఎన్టీఆర్ చేయి వేసి ఆమె కళ్లలోకి చూస్తున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
