స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్ పడిరది. ఐటీ స్టాక్స్తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి, బజాజ్ ్గªనాన్స్, ఐటీసీ వంటి బ్లూ చిప్ కంపెనీల స్టాక్స్ పతనం కావడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 203 పాయింట్ల (0.27 శాతం) నష్టంతో 76,490 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిప్టీ 31 పాయింట్ల (0.13 శాతం) పతనంతో 23,259 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడిరగ్లో 77,079 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 77 వేల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఎన్ఎస్ఈ నిప్టీ సైతం అంతర్గత ట్రేడిరగ్ లో 23,400 పాయింట్ల మార్కును దాటి 23,412 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుకున్నది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ్గªనాన్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టైటాన్, ఐటీసీ స్టాక్స్ 0.5 నుంచి 2.6 శాతం వరకూ నష్టాలతో ముగిశాయి. మరోవైపు బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.56 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఒక శాతం లాభాలతో ముగిశాయి. నిప్టీ ఐటీ ఇండెక్స్ 1.8 శాతం, నిప్టీ మెటల్ 0.38 శాతం నష్టపోగా, నిప్టీ విూడియా ఇండెక్స్ దాదాపు రెండు శాతం లాభ పడిరది.