హావిూలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం
త్వరలోనే రైతు భరోసా కూడా చేపడతాం
అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. భారం మోపం
గోల్కొండ కోట వేదికగా సిఎం రేవంత్‌రెడ్డి స్వాతంత్య్రదినోత్సవ సందేశం
సృజనక్రాంతి/హైదరాబాద్ : తెలంగాణలో గత పదేళ్లలో కోల్పోయిన స్వేఛ్చను పునరుద్దరించడంతో పాటు.. ఇచ్చిన హావిూలను అమలు చేస్తూ చిత్తశుద్దితో పాలన సాగిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరుగ్యారెంటీల్లో భాగంగా రైతులకు రుణమాఫీ చేశామని, అలాగే రైతుభరోసా కూడా త్వరలోనే అందచేస్తామని హావిూ ఇచ్చారు. ఇచ్చిన హావిూలను అమలు చేయడం కాంగ్రెస్ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైనా రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉందని సీఎం రేవంత్ అన్నారు. ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన ’జయ జయహే తెలంగాణ…’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశామని, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. నేటి స్వేచ్ఛ, స్వాతంత్యాల్రు ఎందరో మహనీయుల త్యాగ ఫలం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం తిలకించారు. అంతకుముందు పరేగడ్ గ్రౌండ్‌లో అమరులకు నివాళి అర్పించారు. మా సిద్దాంతం గాంధీ సిద్దాంతం. మా వాదం గాంధేయవాదం. తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో టిఎస్ స్థానంలోటిజిని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది ప్రజల ఆకాంక్ష. మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.75,577 కోట్లుగా ఉన్న అప్పు, గత ఏడాది డిసెంబరు నాటికి దాదాపు రూ.7 లక్షల కోట్లకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచేందుకు ఆర్థిక పునరుజ్జీవనం అవసరం అని భావించాం. ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీస్టక్చర్ర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్టాభ్రివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి… రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులు మేం చేయబోం అని స్పష్టం చేశారు. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హవిూలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.. పంచవర్ష ప్రణాళికలు రచించి, ఈ దేశానికి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్లు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ, ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచు కుంటున్నాం. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చతోరణాన్ని కట్టుకున్నాయంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. నాగార్జున సాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, శ్రీరాంసాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే… ఆ తర్వాత వాటిని పూర్తి చేసి, కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాలు పారించిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకి దక్కుతుంది. అంతేకాదు, పారిశ్రామికంగా బిహెచ్‌ఇఎల్, ఇసిఐఎల్, ఐడిపిఎల్, మిథాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినవే. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్నిరంగాల సమగ్రాభివృద్ధికి కృషిచేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయీకరణతో గ్రావిూణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడుకి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆ నాటి దార్శనికుల వల్లనే జరిగింది.1947 వరకూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మనదేశం, ఈ నాడు ప్రపంచంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన హరిత విప్లవమే. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించే అతికొద్ది దేశాల సరసన భారతదేశాన్ని ఆనాడే నిలుపగలిగారు‘ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వాతంత్య పోరాటమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా రుణమాఫీ చేస్తున్నాం. రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారు. రూ.2 లక్షల వరకు అమలు చేసి చూపిస్తున్నాం. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ కావడం లేదు. అలాంటి వారిని గుర్తించి అందజేస్తాం. కలెక్టరేట్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తాం. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశాం. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తెచ్చాం. దీని పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు కట్టుబడి ఉన్నాం. అర్హులైన అందరికీ రైతు భరోసా అందిస్తాం. గత ప్రభుత్వం అనర్హులకు రైతుబంధు ఇచ్చింది. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నాం. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ చెల్లిస్తాం. దీని కోసం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించాం. పెండిరగ్ ధరణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించాం. భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం. డ్రగ్స్ నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. టీ`న్యాబ్‌ను బలోపేతం చేశాం. సైబర్ మోసాలు, నేరాల బారిన పడిన వారికి సహాయం కోసం 1930 నంబర్ ఏర్పాటు చేశాం. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అంగన్వాడీలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మిస్తాం. ఇటీవలే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. ఇది విప్లవాత్మక మార్పులకు మలుపు కాబోతోంది. స్కిల్ వర్సిటీకి ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్‌గా నియమించాం. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. రాష్ట్ర బ్రాండ్‌ను విశ్వవేదికపై సగర్వంగా చాటాలి. ఇటీవల పెట్టుబడుల సాధన కోసం అమెరికాలో పర్యటించాం. దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యాం. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణను వారికి పరిచయం చేశాం. మరోవైపు హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైడ్రా ఏర్పాటు చేసుకున్నాం.‘ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ తెలంగాణలో ఉందన్నారు. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామని తెలిపారు. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నామని… లోతైన సవిూక్షలతో మంచి చెడులను విశ్లేషించామన్నారు. మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నామని.. ఇంతటి వ్యవస్థలో లోటు పాట్లు ఉండొచ్చని… మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నామన్నారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నామని దాన్ని అక్షరాలా అమలు చేస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన సాగిస్తున్నామని… ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమానావకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన ’జయ జయహే తెలంగాణ…’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైనా రాష్ట్ర గీతం లేని పరిస్థితిని భర్తీ చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విస్తృత వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీచేసే చేస్తామని తెలిపారు. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంటే సులభంగా రోగనిర్దారణ, సత్వర చికిత్సకు వీలుంటుందనే ఈ ఆలోచన చేశామన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ ధర 410 రూపాయలు ఉంటే..నేడు అది 1200లకు చేరిందన్నారు. అందుకే తిరిగి దాన్ని 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో మహాలక్ష్మీ పథకం ఫిబ్రవరి 27న ప్రారంభించామన్నారు. 40 లక్షల మంది లబ్దిదారులతో మొదలైన ఈ పథకం నేడు 43 లక్షల మందికి చేరిందన్నారు. పేదలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలన్న భావనతో గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నామన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 47 లక్షల 13 వేల 112 మంది లబ్ది పొందుతున్నారని తెలిపారు. వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా తమ ప్రభుత్వం ఉందన్నారు. అందుకే డ్జెట్‌లో 72,659 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. రుణ భారంతో ఇబ్బంది పడ్డ రైతన్నలు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం రాష్ట్రంలో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల అభిప్రాయాలు తీసుకొని విధి విధానాలు రూపొందిస్తోందన్నారు. అనంతరం పథకం అమలు చేస్తామని తెలిపారు. వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోందన్న రేవంత్ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారన్నారు. అందుకే సన్నరకం వరి ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల సౌలభ్యం కోసం మొన్నటి రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178కి పెంచామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. నకిలీ విత్తన అక్రమార్కులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందన్నారు. కేంద్రం అందిస్తున్న ఫసల్ బీమా యోజన పథకంలో చేరి రైతులకు పంటలబీమా పథకం వర్తింప చేస్తామన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లిస్తుందని తెలిపారు. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుందన్నారు. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల దిగుబడికి సంబంధించి శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి ’రైతు నేస్తం‘ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. రైతుల పాలిటశాపంగా మారిన ధరణి సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగిందన్నారు. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించామని పేర్కొన్నారు. ’ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ధరణిలో సమస్యల పరిష్కారం, పరిష్కారం చేయలేనివి ఉంటే సదరు దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడిరచారు. పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ళ చొప్పున నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.