క్యాన్సర్ మందులపై 5శాతానికి తగ్గింపు
స్నాక్స్‌పై 18 ` 12 శాతానికి కుదింపు
జీఎస్టీ మండలి భేటీలో నిర్మలా సీతరామాన్ నిర్ణయం
న్యూఢిల్లీ : జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా పడిరది. నవంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ అయిన 54వ జీఎస్టీ మండలి.. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే భేటీలో క్యాన్సర్ ఔషధాలపై, స్నాక్స్‌పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం వెలువడిరది. కౌన్సిల్ సమావేశం అనంతరం సమావేశం వివరాలను విలేకరుల సమావేశంలో మంత్రి వెల్లడిరచారు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి.. మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించింది. బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి నేతృత్వంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందానికే ఈ బాధ్యతనూ కట్టబెట్టంది. కొంతమంది కొత్త సభ్యులు ఈ బృందంలో చేరతారని, అక్టోబర్ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనిపై నవంబర్‌లో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. క్యాన్సర్ ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. స్నాక్స్‌పై 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీని తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2026 మార్చి తర్వాత జీఎస్టీ పరిహార సెస్సు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపైనా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్టీ అంశాలపైనా చర్చించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోల స్థితిగతులను సమావేశంలో ప్రదర్శించామన్నారు. ’క్యాసినో ఆదాయం 30శాతం పెరిగింది. ఆరోగ్య బీమాపై మంత్రుల బృందం అక్టోబర్ చివరి నాటికి నివేదికను సమర్పిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆరోగ్య బీమాపై జీఎస్టీని ఎత్తివేసే నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశాం. ఆరోగ్య బీమాపై రేటును అంచనా వేయడానికి జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. మంత్రుల బృందం అక్టోబర్ చివరి నాటికి నివేదిక అందిస్తుందని నిర్మలా వెల్లడిరచారు. తీర్థయాత్రల కోసం హెలికాప్టర్ సేవల నిర్వహణపై పన్ను ఐదు శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఉత్తరాఖండ్ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడిరచారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ తదితర మతపరమైన తీర్థయాత్రలకు భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సేవలపై 18శాతం నుంచి 5శాతానికి పన్ను తగ్గించామన్నారు. వివిధ వర్గాల ప్రజలకు ఉపయోగపడేవిధంగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. దీంతోపాటు 2026 మార్చి తర్వాత జీఎస్టీ సెస్ కొనసాగింపుపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది.