అన్నదాతలకు కేంద్రం శుభవార్త

జాతీయం

రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి ఉచితంగా విత్తనాల పంపిణీ
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడి
భోపాల్‌ : అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైతులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ మిషన్‌ చొరవతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అభివృద్ధి చేసిన బ్రీడర్‌, సర్టిఫైడ్‌ ,ఫౌండేషన్‌ విత్తనాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని శివరాజ్‌సింగ్‌ తెలిపారు. నూనె గింజల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన 21 రాష్టాల్లోన్రి 347 జిల్లాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 600 క్లస్టర్లలో రైతులకు ఉచితంగా బ్రీడర్‌, సర్ట్గిªడ్‌ మరియు ఫౌండేషన్‌ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తుందని వ్యవసాయ మంత్రి తెలిపారు. భోపాల్‌లో కేంద్రమంత్రి విూడియాతో మాట్లాడారు. భారతదేశం అంతటా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు రైతులను ఆదుకోవడానికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. నేషనల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ మిషన్‌ (ఎన్‌ఎంఈఓ`ఆయిల్‌సీడ్స్‌) కింద రైతులకు ఉచితంగా బ్రీడర్‌ విత్తనాలు, సర్ట్గిªడ్‌ విత్తనాలు, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) అభివృద్ధి చేసిన ఫౌండేషన్‌ విత్తనాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు. నూనెగింజల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన 21 రాష్టాల్లోన్రి 347 జిల్లాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 600 క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతాల్లోని రైతులు ఉచిత విత్తనాలను అందుకోవడమే కాకుండా దిగుబడిని పెంచడానికి అధునాతన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇస్తామని చెప్పారు. రైతులు పండిరచిన ఉత్పత్తులను 100 శాతం కొనుగోలు చేసేలా చూస్తామని వెల్లడిరచారు. ఎడిబుల్‌ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం విషయంలో ఇటీవలి నిర్ణయాలు దేశీయ ఉత్పత్తి మరియు ధరలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయని చౌహాన్‌ తెలిపారు. సోయాబీన్‌, ఆవాలు, పొద్దుతిరుగుడు వంటి ఎడిబుల్‌ ఆయిల్‌లపై గతంలో 0శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 27.5శాతంకి పెంచినట్లు వివరించారు. న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి రైతుల నుంచి సోయాబీన్‌ను కొనుగోలు చేస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *