సికింద్రాబాద్‌ గోవా కొత్త రైలు

తెలంగాణ

ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి గోవా టూర్‌కు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త రైలును అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు రెగ్యులర్‌ సర్వీసులు సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 9న, వాస్కోడిగామా నుంచి ఈ నెల 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌- (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో, వాస్కోడిగామా (17040) రైలు ప్రతి గురు, శనివారాల్లో బయల్దేరుతాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌- మధ్య రెగ్యులర్‌ సర్వీసు (17603) అందుబాటులో ఉంది. మంగళ, బుధ, శుక్ర వారాల్లో ఇది నడుస్తోంది. ప్రయాణికుల నుంచి తీవ్ర డిమాండ్‌ ఉండటంతో ఈ రైలు ఎప్పుడూ కిటకిటలాడుతుంది. హైదరాబాద్‌ నుంచి వాస్కోడిగామాకు మరో రైలు (17021) ఉంది. కానీ ఈ రైలు వారంలో ఒక రోజు మాత్రమే నడుస్తుంది. ఈ రైలులో టికెట్లు దొరకడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో కొత్త రైలు పర్యాటకుల ప్రయాణ అవకాశాల్ని పెంచనుంది. అదనంగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *