బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయం!
ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో జైపూర్ పింక్ పాంథర్స్ శుభారంభం చేసింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39- తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. జైపూర్ పింక్ పాంథర్స్ రైడర్ అర్జున్ దేశ్‌వాల్ 15 పాయింట్లతో సత్తా చాటగా.. అభిజీత్ మాలిక్ ఏడు పాయింట్లతో రాణించాడు. బెంగాల్ వారియర్స్‌లో నితీన్ ధనఖర్ 13 పాయింట్లతో.. మనీందర్ సింగ్ 8 పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఫస్టాఫ్‌లో బెంగాల్ వారియర్స్‌ను ఆలౌట్ చేసిన జైపూర్ పింక్ పాంథర్స్ 21 మూడు పాయింట్స్ ఆధిక్యం సాధించింది. ట్యాక్లింగ్‌లో విఫలమైనా రైడింగ్‌లో సత్తా చాటి 17 పాయింట్స్ సాధించింది. మరోవైపు బెంగాల్ వారియర్స్.. 13 రైడింగ్ పాయింట్స్‌తో పాటు ఐదు ట్యాక్లింగ్ పాయింట్స్ రాబట్టింది. కానీ దూకుడుగా ఆడి ఆలౌటైంది. సెకండాఫ్‌లోనూ ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. దూకుడగా ఆడిన బెంగాల్ వారియర్స్.. అనవసర తప్పిదాలతో పాయింట్స్ చేజార్చుకుంది. ఫస్టాఫ్ కంటే కాస్త నెమ్మదించిన జైపూర్ పింక్ పాంథర్స్ ప్రత్యర్థి తప్పిదాలను క్యాష్ చేసుకొని విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 40 సార్లు రైడింగ్‌కు వెళ్లగా.. బెంగాల్ వారియర్స్ 18 సార్లు, జైపూర్ పింక్ పాంథర్స్ 20 సార్లు సక్సెస్ సాధించాయి. బెంగాల్ వారియర్స్ ఒక సూపర్ ర్్ైడ కూడా సాధించింది. ట్యాక్లింగ్‌లో ఇరు జట్లు విఫలమయ్యాయి. 24 ప్రయత్నాల్లో బెంగాల్ వారియర్స్ 6 సార్లే ఫలితం రాబట్టగా.. జైపూర్ పింక్ పాంథర్స్ 21 ప్రయత్నాల్లో 8 సార్లే సక్సెస్ అయ్యింది.
