కారకులను చట్టప్రకారం శిక్షించాలి
హిందూవాహిని జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన రామకృష్ణ
సృజనక్రాంతి/మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ దిమ్మెను(విగ్రహ స్థూపం) కూల్చి వేసి చిత్రపటానికి చెత్తలో పడేసి కాషాయ జెండాను చించేసిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు పెద్ధబోయిన రామకృష్ణ అన్నారు. ఇదే విషయమై శనివారం రాత్రి డీఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని స్థానిక ఇందిరమ్మ కాలనీలో శివాజీ విగ్రహ(దిమ్మె ను) స్థూపాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దిమ్మెను కూల్చి, చిత్రపటాన్ని చేత్తలో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరమత సహనం పాటిస్తూ ముందుకు సాగాల్సిన తరుణంలో శివాజీ మహారాజ్ చిత్రపటం చెత్తలో వేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కారకులపై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూవాహిని జిల్లా ఉపాధ్యక్షుడు పందిరి మధు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేష్ , కార్యదర్శులు వరకాల సురేష్, సాధినేని నాగేశ్వరరావు, కాముని సతీష్, కాలనీ వాసులు మురళి చారి, నందిపాటి నరేష్, ఉబ్బపల్లి శంకర్, పందిరి గౌతమ్, దొంగరి శివ, బండి శ్రీకాంత్ ఉన్నారు.