హైద్రాబాద్, సృజన క్రాంతి ప్రత్యేక ప్రతినిధి ;
ప్రముఖ సినీ దర్శకుడు వర ముళ్లపూడి దర్శకత్వంలో అన్విక ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సరికొత్త సీరియల్ ‘అమ్మకు ప్రేమతో’ . ప్రముఖ దర్శకుడు,రచయిత, నటుడు, నిర్మాత సంజీవ్ మేగోటి సంభాషణలు అందిస్తున్న ఈ సీరియల్ జెమిని టీవీలో ఆగస్టు 19వ తేదీ నుంచి , ప్రతి రోజూ అంటే , సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 గంటలకు , మళ్ళీ తిరిగి రాత్రి 09:30 గంటలకు ప్రసారం అవుతుంది.
అమ్మ అంటే దైవం. అమ్మ అంటే ఈ సృష్టికి మూలం. అలాంటి అమ్మ, తాను చేయని తప్పుకి తన పిల్లలని కోల్పోతే? అసలు తన పిల్లల్ని ఆ అమ్మ ఎందుకు కోల్పోయింది? మళ్ళీ ఆ తల్లీ, పిల్లలు కలుస్తారా? ఇదే “అమ్మకు ప్రేమతో” సీరియల్ కథ.
ఇది బంధాలు, అనుబంధాల కోసం పరితపించిపోయే మనుషుల కథ. నిజమైన కుటుంబం అంటే ఏంటో, నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈ సీరియల్ లోని సన్నివేశాలు మనసుకి హత్తుకునేలా చెబుతాయి.
ఎంత కఠినమైన మనసునైనా కరిగించే బలం ప్రేమకు మాత్రమే ఉంది అని ఈ కథనం నిరూపిస్తుంది.
ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సీరియల్స్ అందిస్తున్న జెమిని టీవీ లో ప్రారంభం కానున్న ఈ సీరియల్ లో హీరోగా శ్రవణ్ కుమార్ (మగువ మగువ ఫేమ్) , హీరోయిన్స్‌గా హన్సిత విజయన్, కశ్వి నటిస్తుండగా,
రాజేశ్వరి నాయర్, శిరీష్ సౌగంధ్, సురేష్(ముద్ద మందారం), రాఘవ, విజయ్ రెడ్డి, రోజా భారతి, జ్యోతి పూర్ణిమ, దేవి శ్రీ ప్రభు, రాజేంద్ర కుమార్, చిన్ని కృష్ణ, విజయ, యశ్వంత్ సూర్య, మహతి, బి.ఎన్ శర్మ, శ్రీ రామ్ రమేష్, నిర్మలమ్మ, పుష్ప, ఆర్.కె నాయుడు, నేత్ర రెడ్డి, మాధవ సాయి తదితరులు సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తున్నారు.
నిర్మాణ సంస్థ: అన్విక ఆర్ట్స్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ప్రకాష్ రెడ్డి , ప్రొడక్షన్ కంట్రోలర్ : కొల్ల గంగాధరం, కాస్ట్యూమ్స్: సతీష్ , మేకప్ ; శ్రీను, డిఓపి: చేగు మురళి కృష్ణ, ప్రత్తిపాటి విజయ్ కుమార్, మ్యూజిక్ : సాయి మధుకర్, ఎడిటర్ : దొండపాటి రాజేష్ చౌదరి, కథ: గాంధీ మనోహర్, స్క్రీన్-ప్లే, డైలాగ్స్: సంజీవ్ మేగోటి, సహదర్శకులు: బుర్రి ప్రశాంత్, ఆయన్ష్ రెడ్డి , సహ-నిర్మాతలు: బోదంగి మురళీ కృష్ణ, అంజు ఫిల్మ్స్ నారాయణ మూర్తి , నిర్మాత: సంజీవ్ మేగోటి , ఎపిసోడ్ దర్శకుడు: సుభాష్.ఆర్, దర్శకుడు: వర ముళ్ళపూడి