వాతావరణ శాఖ హెచ్చరిక
సృజనక్రాంతి/విశాఖపట్టణం : ఏపీని వరుణుడు ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్టాన్న్రి అతలాకుతలం చేస్తుండగా.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడుతోంది. రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాలో మోస్తారు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. ట్రయల్ రన్ తర్వాత ఈ డ్రోన్లు దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, మెడిసిన్, తాగునీరు వంటివి తీసుకెళ్తాయనే అంచనాకు వచ్చినట్లు సమాచారం.
