నాలుగంచెల భద్రత

తెలంగాణ

ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు
పదివేల మంది సిబ్బంది వినియోగం
విూడియా సమావేశంలో వికాస్‌ రాజ్‌

సృజనక్రాంతి/హైదరాబాద్‌ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌నకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర సీసీ కెమారాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు.. కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి మే 13న ఎన్నికలు నిర్వహించగా… జూన్‌ 4న కౌంటింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించే ఏజంట్లకు సెల్‌ఫోన్‌ లకు అనుమతి లేదన్నారు.కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్‌ఫోన్లు వినియోగించేందుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎలక్టాన్రిక్‌ పరికరాలు తీసుకెళ్లవద్దని సూచించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు.

కౌంటింగ్‌ కేంద్రంలో ప్రతి మూల కవర్‌ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర నాలుగంచల భద్రతతో పాటు 144 సెక్షన్‌ విధించినట్లు వికాస్‌రాజ్‌ తెలిపారు. ఉదయం 6 గంటలకు, ఏజెంట్లు ..ఉదయం 7 గంటలకల్లా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగుతుందన్నారు. పోస్టల్‌ ? బ్యాలెట్‌ ను లెక్కించేందుకు 19 కౌంటింగ్‌ కేంద్రాలు,276 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే 135 స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 34 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగుతుంది. మూడు చోట్ల 24 రౌండ్లు ఉన్నాయన్నారు. యాకుత్‌పుర, చొప్పదండి, దేవరకొండలో 24 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుందన్నారు. ఆర్మూర్‌ , భద్రాచలం, అశ్వారావుపేటలో 13 రౌండ్లు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు కౌంటింగ్‌ పూర్తిఅయ్యే అవకాశం ఉందని వికాస్‌రాజ్‌ తెలిపారు.

సర్వీసు ఓటర్ల కోసం కేటాయించిన ఇటిపిబి ఓట్ల లెక్కింపు కూడా, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు కేంద్రాల్లోనే నిర్వహిస్తారు. వీటికోసం వేరేగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. వివి ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు కోసం ఇవిఎం ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే ప్రత్యేక క్యాబిన్‌లను ఏర్పాటు చేశారు. ఫలితాలను ప్రకటించడానికి ప్రతీ లెక్కింపు కేంద్రంలో బోర్డులను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాలవద్ద నాలుగంచెల భద్రతా వ్యవస్థను, బారికేడిరగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీచోటా తనిఖీలు నిర్వహిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో 2,400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గొంటారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *