సమస్త రాజకీయ పార్టీలు బిసి రిజర్వేషన్లకు సాలుకూలంగా కనబడతాయి గానీ ఆయా పార్టీలకు ఎవరి ఏజెండా వారికి ఉంది. ఉంటుంది కూడా. ఇది ఉపరితలం మీద కనబడే దృశ్యం కానీ పునాదిలోని సారం వేరే విధంగా ఉన్నది. బీసీ రిజర్వేషన్ల రూపానికి సారానికి మధ్య బోలెడు వైరుధ్యాలు ఉన్నాయి . అన్ని పార్టీలలోని రాజకీయ నాయకుల పొంతన లేని మాటలకు చేతలకు మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటున్నది.
కేంద్ర ,రాష్ట్ర ,జాతీయ, ప్రాంతీయ పార్టీలలో బి.సి.వాదం రిజర్వేషన్ల అంశం ఇప్పుడు పొయ్యి మీద సెగకు ఉంది. ఈ సెగను మంటగా ఎగదోసి వాదానికి ఒక దిశను దశను చూపి ప్రజా సమూహాలలో శక్తివంతంగా వ్యాప్తి చెందేలా చేయడానికి కార్యాచరణను బీసీ రచయితలుగా రూపొందించుకోవలసి ఉన్నది. అందు గురించి ఆయా జిల్లాలలోని పలు వర్గాల రచయితలతో కవులతో విస్తృతస్థాయిలో పలు విధాలుగా తర్జనభర్జన పడి, మాట్లాడి, చర్చించి చివరికి మేము ఒక నిర్ణయానికి వచ్చాము.
గత రెండు దశాబ్దాలుగా వివిధ వెనుకబడిన వర్గాల నుంచి కులాల నుంచి చాలామంది కవులు రచయితలు నేడు తెలుగు సాహిత్యంలో అదీ ముఖ్యంగా తెలంగాణ నేల మీంచి రాస్తున్నారు. వీరంతా కొంచెం అటు ఇటుగా తెలుగు సాహిత్యంలో అగ్రవర్ణాలు పెట్టిన ఒరవడిలోనే ఎక్కువగా రాస్తున్నారు. కొందరు అక్కడక్కడ తమ కులంలోని, జీవితంలోని అనుభవాలను, ఆలోచనలను అక్షర బద్దం చేస్తున్నారు. వీరంతా విడివిడిగా ఎవరి పరిధిలో వారే ఎవరికి వారే విడిగా కృషి చేస్తున్నారు. కానీ వీరందరినీ ఒక్క చోట చేర్చాలని భావించాము. వీరి యొక్క రచనలు రాజకీయ రంగాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో కదిలించడం లేదు. అందువలన వెనుకబడిన కులాల యొక్క బలాన్ని ఐకమత్యాన్ని చూపించాల్సిన వాతావరణం ఏర్పడినది. ఇప్పుడు అటువంటి అవసరము ఉన్నది.
అందు గురించి రానున్న సంక్రాంతి సెలవులలో తెలంగాణ బీసీ రచయితల (స్త్రీలు,పురుషులు) మహాసభ నిర్వహించాలని కొందరు మిత్రులతో కలిసి సంకల్పించాము.
బీసీ రచయితల మహాసభ స్థలం, వేదిక, తేదీలు, సమావేశ వివరాలు త్వరలో తెలియజేస్తాము. కావున తెలంగాణ వివిధ జిల్లాలలో ఉన్న బీసీ కవులు, రచయిత్రులు, రచయితలంతా తమ తమ వివరాలను ఈ దిగువ ఇచ్చిన ఆయా జిల్లాల కో కన్వీనర్ల ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా వివరాలు వెంటనే తెలియజేసి, బిసి రచయితల వేదిక మహాసభలు విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.
-జూకంటి జగన్నాథం, కన్వీనర్
బి.సి.రచయితల వేదిక మహాసభ
సెల్ నెంబర్:9441078095
ఉమ్మడి జిల్లాల కో కన్వీనర్లు. ఆయా జిల్లాల రచయితలు కవులు సంప్రదించాల్సిన సెల్ నంబర్లు
ఖమ్మం: సునంద వురిమళ్ల – 94418 15722
వరంగల్: బండారి రాజకుమార్ – 89195 56560
ఆదిలాబాద్ :ఉదారి నారాయణ- 94414 13666
నిజామాబాద్:వడ్ల శంకర్: 94407 98954
హైదరాబాద్: రంగారెడ్డి:వెల్దండి శ్రీధర్: 98669 77741
నల్గొండ :బెల్లి యాదయ్య: 98483 92690
మహబూబ్ నగర్: వనపట్ల సుబ్బయ్య: 94927 65358
భీంపల్లి శ్రీకాంత్: 90328 44017
కరీంనగర్ : మద్దికుంట లక్ష్మణ్: 94416 77373, బూర్ల వెంకటేశ్వర్లు 94915 98040
మెదక్: పర్కపల్లి యాదగిరి: 92999 09516
