ఎన్నికల పర్వం చివరిదశకు చేరుకున్నది.నాయకుల ప్రచారం కూడా 30వతేదీతో ముగియనున్నది.మోదీ కాంగ్రెస్ తదితర పార్టీలను తన మాటలతో చీల్ఛిచెండాడుతున్నారు.ప్రతిపక్షాలలో ఆయనను నిలువరించే నాయకుడు లేకపోవడంతో చెలరేగిపోతున్నారు.గతంలో కాంగ్రెస్ చేసిన పనుల వల్ల దేశానికి తీవ్రంగా నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు.అలాగే తాము గెలిస్తే మా అజెండా అమలు చేస్తామని బెదిరింపుధోరణిలో మాట్లాడుతున్నారు.శనివారంతో ఆరువిడతల ఎన్నికలు పూర్తిఅయ్యాయి.428+58=486 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తి అయ్యాయి.14 రాష్ట్రాలలో ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ముఖ్యంగా బెంగాల్,పంజాబ్,హర్యానా,ఒడిసాలలో బీజేపీఎన్ని స్థానాలు గెలుస్తారో అనుమానమే.పంజాబ్,హర్యానాలలో రైతులు మోదీ రాకకు నిరసనగా ప్రదర్శనలు చేసారు.కాని మోదీ తాను రైతుల సంక్షేమానికే కృషి చేసానని సమర్ధించు కున్నారు.ఇక జూన్ 1వతేదీ చివరి విడత పోలింగ్ జరుగనుంది.మొదటి,రెండో విడత పోలింగ్ లో బీజేపీ 100 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నది.మొదటి రెండు విడతల్లో దక్షిణాదిలో ఎక్కువ స్థానాల్లో పోలింగ్ జరిగింది.ఈ సారి దక్షిణాది లో 50-60సీట్లు వస్తాయని బీజేపీ భావిస్తున్నది. ఉత్తరాదిలో కొన్ని స్థానాలు కోల్పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఉత్తరాదిలో కోల్పోయిన స్థానాలు దక్షిణాదిలో గెలవాలని మోదీ బృందం దృష్టి పెట్టింది. తెలంగాణ, కర్నాటక,ఏపీ,తమిళనాడులో తీవ్రంగా ప్రచారం చేసారు.పంజాబ్లో మోదీ ఎన్నికల సభలో మాట్లాడుతూ సిక్కు ల పవిత్ర స్థలం కర్తార్ పూర్ షాహెబ్ గురుద్వారా పాకిస్తాన్ నుంచి భారత్లో కలుపుకునే మంచి అవకాశాన్ని 1971 బంగ్లావిమోచన యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిర పోగొట్టారని విమర్శించారు. తానై తే అప్పుడు భారత్ ఆధీనంలో ఉన్న 90 వేల మంది పాక్ సైనికులు కర్తార్పూర్ ఇస్తే వదులుతామని షరతుపెట్టేవాడినని పేర్కొనడం సిక్కుఓట్లకు గాలెం వేయడమే అనుకోవాలి.మోదీ అధికారంలోకి మళ్లీ వస్తే పలు రాష్ట్రాల నేతలపై ఈడి,సీబీఐ లతో వేధిస్తారని వారు భయపడుతున్నారు.అందుకే మొదట్లో లేని ఐకమత్యం క్రేజీవాల్ అరెస్టు తరువాత ఇండియాఫ్రంట్ నేతల్లో కనిపిస్తున్నది.మోదీ కి ఆది నుంచి ప్రాంతీయపార్టీల పట్ల సదుద్దేశం లేదు.వాటిని అణచివేయడానికి వ్వూహాలు వేస్తారు.బీజేపీని ఓడించాలని ఫ్రంట్ నేతలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు.ఒకవేళ సాధ్యంకాకపోతే సాధారణ మేజార్టీ కంటే తక్కువ వచ్చేలా చేయాలని భావిస్తున్నారు.
మోదీ ఈసారి వస్తే 2047 వరకూ తానే దేశ నాయకుడిగా ఉంటానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.అంటే ఈ సారి వస్తే దానికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేసుకుంటారని ఆయన మాటల్లోనే అర్ధమవుతున్నది.మోదీ ప్రజా ధనం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడమే కాక ఆయన వ్యక్తిగత మేకప్ కోసం రోజుకు రూ.20వేలు ఖర్చు చేస్తున్నారని తిరుపతికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ ఆరోపించారు. అంతేకాక అయన దుస్తులకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తారని ఆరోపించడం విశేషం.మరో 6 రోజుల్లో ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ 4వ తేదీన రాజకీయపార్టీల, అభ్యర్ధుల జాతకాలు బయటపడతాయి. రాజు ఎవరో, బంటు ఎవరో వెల్లడవుతుంది. కేంద్రంలో మోదీ వస్తే దేశ రూపురేఖ మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అలాగే ఫ్రంట్ వస్తే సంకీర్ణ ప్రభుత్వం రావచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే అభివృద్ధికి బాటలు పడతాయి.మారక పోయినా రానున్న ఐదేళ్లలో ఊహించని ప్రగతి కనిపిస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు.ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాబోయే ప్రజాతీర్పు ఎలా ఉందో చూద్దాం.
(యం.వి.రామారావు ,ప్రత్యేక ప్రతినిధి)