ప్రతి సృజన కారునిలో చిన్నపిల్లల మనసు ప్రస్ఫుటిస్తుంది: ఆచార్య కొలకలూరి మధుజ్యోతి

తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, తెలుగు అధ్యయన శాఖ వారు ఆదివారం నిర్వహించిన తెలుగు సాహితీ సమితి కార్యక్రమం ద్విగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ ఆర్ సి కృష్ణస్వామి రాజు గారు రచన వ్యాసంగాన్ని మొదలుపెట్టి 20 పుస్తకాలు వెలువరించారని తెలిపారు. తన చుట్టూ ఉన్న పల్లె జీవితాలను, తాను చూసిన విషయాలను రచనలలో పొందుపరిచారన్నారు. రాజుగారి రచనలు ఆహ్లాదకరంగా ఉంటాయని, విద్యార్థులు రచనలు చదివి […]

More

అమరావతిలో 58 అడుగల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు

అమరజీవి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతాం 12 నెలలు 12 కార్యక్రమాలతో 125వ జయంతి ఉత్సవాలు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047కి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌ చేస్తాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే జయంతి […]

More

మిర్చి రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు

మిర్చి రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంతో అన్ని స్థాయిలలో చర్చలు జరుపుతున్నాం. నిబంధనలు సడలించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఎగుమతిదారులతో సమావేశం జరుపుతున్నాను. అదే విధంగా ట్రేడర్లతో కూడా మాట్లాడుతున్నాం. మిర్చి రైతుకు న్యాయం చేస్తాం.

More

వైరల్‌ జ్వరంతో ఇబ్బందిపడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వైరల్‌ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోపాటు స్పాండిలైటిస్‌ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశానికి పవన్‌ కల్యాణ్‌ హాజరు కాలేకపోవచ్చునని ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

More

టిటిడి కృషికి సీఎం చంద్రబాబు అభినందనలు

సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీటీడీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి లక్షలాదిగా వచ్చిన భక్తులకు…. ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో టీటీడీ సఫలీకృతమైందన్నారు. పవిత్ర దినాల్లో తిరుమలకు మరింతగా పోటెత్తే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి చక్కని దర్శన భాగ్యం అందించేందుకు టీటీడీ చేస్తున్న కృషిని […]

More

కుప్పంలో ‘సూర్య ఘర్‌’ సోలార్‌ పైలట్‌ ప్రాజెక్టు

ప్రతి ఇంటిలో నెలకు 200 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి ఏడాదికి రూ.4వేల విలువైన కరెంట్‌ ఉచితంగా వినియోగం ’స్వర్ణ కుప్పం విజన్‌-2029’ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు చిత్తూరు : మన ఇళ్లపై మనమే కరెంట్‌ ఉత్పత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సౌర, పవన విద్యుత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని.. వీటి కారణంగా ప్రజలపై బిల్లుల భారం తగ్గుతుందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో ’సూర్య ఘర్‌’ సోలార్‌ పైలట్‌ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం […]

More

కూటమిలో వేలుపెట్టే ప్రయత్నంలో జగన్‌

బూత్‌ లెవల్‌ నుంచి అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే ఐటి శాఖ మంత్రి లోకేశ్‌ వెల్లడి భీమవరం : కూటమిలో మిస్ఫైర్‌, క్రాస్‌ ఫైర్‌, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. అయితే కూటమిని విడదీసే పనిలో సైకో వైఎస్‌ జగన్‌ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్‌ లెవెల్‌ నుంచి జాతీయ స్థాయి వరకూ మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నారా […]

More

కూటమికి పొంచివున్న విద్యుత్ గండం

(యం.వి.రామారావు, ప్రత్యేక ప్రతినిధి) ఏపీలోని కూటమి ప్రభుత్వానికి విద్యుత్ గండం పొంచి ఉంది.అసలే నిధుల సమీకరణలో కుంటి నడక నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ గండం నుంచి బయటపడే మార్గం ఉందా అనేది ఒకటి రెండురోజుల్లో తేలనుంది. 2022-23 సంవత్సరం ఇంధన,విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీలు రూ.8114 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణమండలికి డిస్కమ్ లు ప్రతిపాదించడం తెలిసిందే. కాగా డిస్కమ్ లు మరో ప్రతిపాదన చేయడం విశేషం.75 శాతం ప్రభుత్వం […]

More

దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

ఉచిత ఇసుక సీనరేజ్‌, జీఎస్టీ ఛార్జీల రద్దు ఇసుక అక్రమంగా విక్రయిస్తే పిడి యాక్ట్‌ కొరత ఉన్న ఐదు జిల్లాలో ఇసుక పాయింట్ల ఏర్పాటు విశాఖ శారదాపీఠం భూముల కేటాయింపు రద్దు ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు ఎపి కేబినేట్‌ భేటీలో కీలక నిర్ణయాలు అమరావతి : దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు ఎపి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి […]

More

25 నుంచి మంత్రి లోకేశ్‌ అమెరికా పర్యటన

ఐటి సినర్జీ కాన్ఫరెన్స్‌కు హాజరు అమరావతి : ఏపీలో పెట్టుబడులపై ఈ నెల 25 నుంచి మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్‌ ఒకటో తేదీ వరకు శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో లోకేశ్‌ పర్యటించనున్నారు. ఈ నెల 25 తేదీన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే ఐటీ సినర్జీ కాన్పరెన్సుకు మంత్రి హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులపై ప్రముఖ కంపెనీలతో మంత్రి లోకేశ్‌ భేటీ కానున్నారు. నారా లోకేష్‌ వెంట సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీఈడీబీ […]

More