భారత్‌కు అమెరికా భారీ షాక్‌

21 మిలియన్‌ డాలర్ల సాయం నిలిపివేత మస్క్‌ సారథ్యంలోని డోజ్‌ ప్రకటన వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాలకు భారీ షాక్‌ ఇచ్చారు. భారత్‌లో ఒటరు శాతం పెంపుదలకు ఇప్పటి వరకు అందజేస్తున్న 21 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 182 కోట్లు) సాయాన్ని నిలిపివేశారు. అంతర్జాతీయ సాయంలో విస్తృతంగా విధిస్తున్న కోతల్లో భాగంగానే డోజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. భారత్‌, బంగ్లాదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ స్థిరత్వాన్ని […]

More

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం ..179 మంది మృతి

సియోల్‌ (దక్షిణ కొరియా): ప్యాసింజర్‌ విమానం ఒకటి దక్షిణ కొరియాలోని మువాన్‌ పట్టణం విమానాశ్రయం వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 179 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగినప్పుడు విమాన సిబ్బందిసహా మొత్తం 181 మంది ఉన్నారు. సిబ్బందిలో ఇద్దరు మినహా మిగతా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అధికారిక ప్రకటనను అనుసరించి, స్థానిక కాలమానం ప్రకారం, థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి దక్షిణ కొరియా వస్తున్న జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం […]

More

సరిహద్దు గస్తీపై ఇరు దేశాల మధ్య ముందడుగు

జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ చర్చలు మాస్కో : రష్యాలోని కజన్‌లో జరుగుతోన్న బ్రిక్స్‌ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సరిహద్దు గస్తీపై జరిగిన ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరు దేశాల ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల తర్వాత అధికారికంగా సమావేశం అవుతున్నాం. భారత్‌`చైనా […]

More

ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచం ఏకతాటిపై నిలవాలి

ద్వంద్వ ప్రమాణాలకు తావీయరాదు ‘బ్రిక్స్‌’ సదస్సులో ప్రధాని మోదీ మాస్కో :ఉగ్రవాదంపై పోరుకు యావత్‌ ప్రపంచం ఏకతాటిపై నిలవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనిపై ద్వంద్వ ప్రమాణాలకు తావీయరాదని పరోక్షంగా చైనా తీరును ఎండగట్టారు. కజాన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్‌ సదస్సు ముగింపు సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం అనే తీవ్ర సమస్యను కలిసికట్టుగానే ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఇలాంటి అంశాల్లో ద్వంద్వ ప్రమాణాలు సరికాదన్నారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధుల సరఫరా అనేవి చాలా […]

More

తైవాన్‌ చుట్టూ చైనా మిలిటరీ విమానాల చక్కర్లు

ఆందోళన వ్యక్తం చేసిన జపాన్‌ తైపీ : స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్‌ చుట్టూ 153 చైనా మిలిటరీ విమానాలు చక్కర్లు కొట్టినట్లుగా తైవాన్‌ రక్షణశాఖ వెల్లడిరచింది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు తైవాన్‌ను చుట్టుముట్టి న విమానాల వివరాలను రికార్డు చేసినట్లు పేర్కొంది. 25 గంటల వ్యవధిలో చైనా నౌకాదశానికి చెందిన 14 నౌకలను నమోదుచేసినట్లుగా తెలిపింది. ఇది అసమంజసమని, సహేతుకం కాదని, రెచ్చగొట్టే చర్యలా ఉందని రక్షణశాఖ ఉన్నతాధికారులు చైనాపై మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ […]

More

శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక

కొలంబో: చివరి వరకూ అంతులేని ఉత్కంఠ సృష్టించిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పునిచ్చారు. మార్కిస్ట్‌ జనతా విముక్తి పెరమూన పార్టీ (ఎంజెవిపి) నాయకుడు, నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పిపి) కూటమి అభ్యర్థి అరుణ కుమార దిసనాయకే (54) విజయభేరి మోగించారు. రెండో రౌండ్‌ కౌంటింగ్‌లో ఆయన గెలిచినట్టు శ్రీలంక ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. శనివారం పోలింగ్‌ పూర్తికాగా, ఆ వెంటనే మొదలైన మొదటి రౌండ్‌ కౌంటింగ్‌ ఆదివారం మధ్యాహ్నం వరకూ కొనసాగింది. అయితే, ఏ […]

More

పశ్చిమాసియాలో సంక్షోభాలు ఆందోళనకరం

యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదు పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీలో ప్రధాని మోడీ వార్సా : ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతామన్నారు. పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయిన తర్వాత విూడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో […]

More

థాయిలాండ్‌ ప్రధానిగా పేటోంగ్టార్న్‌ షినవత్రా

థాయిలాండ్‌ : బిలియనీర్‌ మాజీ ప్రధాని థాక్సిన్‌ షినవత్రా కుమార్తె 37 ఏళ్ల పేటోంగ్టార్న్‌ షినవత్రా థాయిలాండ్‌ తదుపరి ప్రధానిగా ఆమోదం పొందారు. తన క్యాబినెట్‌ కు నేర చరిత్ర కలిగిన న్యాయవాదిని నియమించినందుకు రాజ్యాంగ న్యాయస్థానం మాజీ ప్రధాని స్రేత తావిసిన్ను పదవి నుండి తొలగించిన రెండు రోజుల తరువాత ఆమె ఎంపిక జరిగింది. పేటోంగ్టార్న్‌ దేశంలో ఈ పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కురాలు అవుతారు. ఆమె షినవత్రా ముగ్గురు పిల్లలలో చిన్నది. అలాగే […]

More

నవచరిత్రను  సృష్టించిన నికోలస్  మదురో

వెనిజులా విప్లవ వేగుచుక్క హ్యూగో చావెజ్ రాజకీయ వారసుడు, వెనిజులా అధ్యక్షుడు  నికోలస్ మదురో వరుసగా మూడవసారి  గెలుపొంది నవచరిత్రను సృష్టించారు. వెనిజులాలో గత ఆదివారం అధ్యక్ష ఎన్నికలను నిర్వహించి 80 శాతం ఓట్లను లెక్కించగా నికోలస్ మదురో  51.20 శాతం ఓట్లు సాధించి మూడవసారి అధ్యక్షుడుగా ఘన విజయం సాధించడం లాటిన్ అమెరికాలో విశిష్ట ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కారకాస్‌లోని శ్రామిక తరగతి రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించిన నికోలస్ మదురో ఒక సాధారణ బస్ డ్రైవర్ […]

More

అధ్యక్ష రేస్‌ నుంచి తప్పుకున్న బైడెన్‌

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలిగారు. డెమోక్రటిక్‌ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా ఆయన డెమోక్రట్రిక్‌ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది. దానికి తోడు ఇటీవల ఆయన కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More