జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ శుభారంభం..

బెంగాల్‌ వారియర్స్‌పై ఘన విజయం! ప్రోకబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌(పీకేఎల్‌) సీజన్‌ 11లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 39- తేడాతో బెంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ రైడర్‌ అర్జున్‌ దేశ్‌వాల్‌ 15 పాయింట్లతో సత్తా చాటగా.. అభిజీత్‌ మాలిక్‌ ఏడు పాయింట్లతో రాణించాడు. బెంగాల్‌ వారియర్స్‌లో నితీన్‌ ధనఖర్‌ 13 పాయింట్లతో.. మనీందర్‌ సింగ్‌ 8 పాయింట్లతో రాణించినా […]

More

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

36 ఏళ్ల తర్వాత టీమిండియాపై విజయం! న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య భారత్‌ను చిత్తు చేసింది. అద్భుతం చేస్తారని భావించిన భారత స్పిన్నర్లు చేతులెత్తేసారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచింది. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్‌ టెస్ట్‌ విజయాన్నందుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన […]

More

టీమిండియా మరో చెత్త రికార్డు

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఘోర వైఫల్యం 46 పరుగులకే ఆలౌట్‌ అయిన బ్యాటర్లు బెంగళూరు : స్వదేశంలో తిరుగులేదని భావిస్తున్న భారత్‌కు న్యూజిలాండ్‌ బౌలర్లు షాక్‌ ఇచ్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌటైంది. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ కావడం గమనార్హం. ఇద్దరు మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేశారు. రిషభ్‌ పంత్‌ (20), యశస్వి జైస్వాల్‌ (13) కాసేపు పోరాడారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు […]

More

మహిళల టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్‌పై భారత్ విజయం

దుబాయి: యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్.. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. […]

More

బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం

గ్వాలియర్: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. మూడు టీ20ల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంగ్లాదేశ్‌ను 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. 128 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (16;7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా […]

More

డబ్ల్యుటిసి -2025 ఫైనల్‌ ముహుర్తం ఖరారు

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యుటిసి) 2025 ఫైనల్‌ ముహుర్తం ఖరారైంది. క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ వేదికగా ఈ బిగ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ వివరాలను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా వెల్లడించింది. లండన్‌లోని లార్డ్స్‌ మైదానం వేదికగా జూన్‌ 11-15 మధ్య ఈ మెగా టెస్ట్‌ ఫైనల్‌ జరగనుందని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. జూన్‌ 16 రిజర్వ్‌ డేగా కేటాయించింది. లార్డ్స్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి. టెస్ట్‌లకు ఆదరణ పెంచాలనే […]

More

బంగ్లాదేశ్‌ సరికొత్త చరిత్ర

పాకిస్థాన్‌ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడంపై బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్‌ షాంటో సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే జోరులో భారత్‌ను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ 6 వికెట్లతో తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి సిరీస్‌ విజయం. ఈ విజయానంతరం […]

More

హాకీలో కాంస్య పతకం

ఒలింపిక్స్‌లో స్పెయిన్‌పై గెలుపొందిన భారత్‌ జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్‌ చేసి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ ఆరంభంలో (18వ నిమిషం) స్పెయిన్‌ […]

More

స్వాతంత్య్రానంతరం రెండు పతకాలు సాధించిన మను భాకర్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత జోడీ మను భాకర్‌, సరబ్జోత్‌ సింగ్‌ చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో మను, సరబ్జోత్‌ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కొరియా జోడీని భారత షూటర్లు ఓడిరచారు. అంతకుముందు ఆదివారం, మను భాకర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన ఖాతాలో మరో పతకం యాడ్‌ అయ్యింది. ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ […]

More

శ్రీలంక కొంపముంచిన వర్షం.. సిరీస్‌ భారత్‌ సొంతం

న్యూఢిల్లీ : శ్రీలంక పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు పదే పదే వర్షం అంతరాయం కలిగించగా.. అంపైర్లు భారత్‌ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఈ గెలుపుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే […]

More