విమర్శ….. విమర్శకుడు

ఒక అక్షర సృజనలోని గుణదోషాలను తెలియచేస్తూ సహేతుకంగా, ఆలోచనాత్మకంగా చేసే వ్యాఖ్యానమే విమర్శ. ఆ వ్యాఖ్యాతే విమర్శ కుడు. మంచి రచనలో అంతర్భాగమై, నిగూఢంగా ఉండే భావాలను వెలుగులోకి తెచ్చేవాడే విమర్శకుడు.ఆ భావసంపత్తి గొప్పదనాన్ని తన శోధనానేత్రంతో గుర్తించి, దాని సాంద్రతను అంచనా వేసి, వివరించే వాడు. వాటి లోతుల్లోకి తన సునిశితదృష్టిని ప్రసరింప చేసి, దర్శించగలిగే వాడు. తాను దర్శించిన వాటిని విశదపరిచే వాడు. ఆ విధంగా చదువరుల దృష్టిని అటువైపు సారింప చేసే మార్గదర్శి. […]

More

సాహితీ సృజనకు స్ఫూర్తి…

మనం ఏ పని చేయటానికికైనా స్ఫూర్తి అవసరం.స్ఫూర్తి అంటే ఒక ఉత్సాహం.ఒక ఆవేశం. ఓ ఊహ. ఒక చోదకశక్తి.ఇది మనలో ఉత్తేజాన్ని నింపి ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టేటట్టు చేస్తుంది. సాహితీ సృజనకూ స్ఫూర్తి అవసరం. ఆ ఆలోచన రాగానే అది ఎక్కడ నుండి వస్తుంది,ఏ రూపంలో ఉంటుంది అన్న ప్రశ్నలు లేదా అనుమానాలు మన మనసులో ఉదయిస్తాయి.అది ఈ విధంగా ఉంటుంది, ఇలా వస్తుందని కచ్చితంగా చెప్పటం అసాధ్యం.ఏదైనా ఒకనిర్వచనంలో పొదగటమూసాధ్యంకాదు.ఎందుకంటే ఈ సృష్టిలో ఏదైనా,ఎవరైనా […]

More