చెబుతా వినుకో మల్లన్న

మానవజాతి చరిత్ర సమస్తం పరస్పర హననమే విశ్వం ఆవిర్భావం నుంచి ఆధిపత్యపోరాటాలే తమ నాశనం తామే లిఖించుకుంటున్న మానవులు “ఏ దేశ చరిత్ర చూసినా….ఏమున్ననది గర్వకారణం…నరజాతి చరిత్ర సమస్తం..పరపీడన పరాయణత్వం” అని మహాకవి శ్రీశ్రీ కవితలు అక్షరసత్యం,వాస్తవం. ఏ దేశ చరిత్ర తిరగేసినా పరస్పర హననం,హింస,బానిసత్వం,పరపీడన,యుద్ధం,కీర్తి దాహంతో నిండి ఉంది. యథా రాజా తథా రాజా అన్నట్లు ప్రజలు కూడా పాలకుల పంథాలో నడిచారు. ఈ భూమండలం ఈ ఆధునిక యుగంలోనూ పరస్పర శత్రుత్వాలతో అణుబాంబుల రూపంలో […]

More

బాలల భవిత ‘ఆన్‌లైన్‌’లో ఆవిరి

ఫోన్‌గేమ్‌ యాప్‌ల కౌగిలిలో నలిగిపోతున్న పిల్లలు సహజ ఆలోచన శక్తిని కోల్పోయి శారీరక, మానసిక సమస్యల్లో చిక్కుకుంటున్న చిన్నారులు నిర్ధాక్షిణ్యంగా కట్టడి చేయాలి నిర్లక్ష్యం చేస్తే ‘చనిపోయిన మొక్కలకు నీళ్లు పోసినట్లే’ చిగురించక మురిగిపోనున్న భవిష్యత్‌ తరం ~~~~~~ విస్తృత రూపంలో సమాజమే, సూక్ష్మ రూపంలో బడి. ఆ తరగతి గది రేపటి పరిపూర్ణ వ్యక్తిత్వం గల పౌర సమాజాన్ని తయారుచేసే విజ్ఞాన కర్మాగారం. ఇల్లు-బడి బాల్యానికి బంగారు భవిష్యత్తును అందించే కేంద్రాలు. ఇంట్లో, బడిలో, సమాజంలో […]

More

పారిశుద్ధ్య కార్మికుల మురికి బతుకులు మార్చలేరా !

దేశంలో “స్వచ్ఛ భారత్”కు పదేళ్లు గడిచిన లక్ష్యాన్ని చేరలే.. డంపింగ్ సైట్లలోని చెత్తను శాస్త్రీయంగ శుద్ధి చేయడంలో నిర్లక్ష్యం.. పారిశుద్ధ్య(సఫాయి) కార్మికులు 92 శాతం అణగారిన కులాలవారే.. వీరి వెలకట్టలేని సేవలకు గౌరవం, న్యాయం దక్కాలి.. ప్రజా శ్రేయస్సుకు పరిశుభ్రతే ప్రాణ ప్రధానం ఇది సమిష్టి బాధ్యత.. మన దేశ ప్రజానీకం ఆరోగ్యంగా, ఆనందంగా అస్తరు సెంట్లు చల్లు కొని ఆదామరిచి నిద్రిస్తుంటే.. పారిశుద్ధ్య (సఫాయి )కార్మికులు కోడికూత పొద్దున్నే నిద్ర లేచి చెత్త చెదారం, అపరిశుభ్ర […]

More

భూముల్లో నిస్సారం-పంటల్లో పోషకాలు తగ్గుముఖం

అధిక దిగుబడులు సరే.. పంటలు ఎరువుల మయం, నేల నిస్సారం.. అన్నదాతలకు తప్పని సాగు భారం, ఆహార పంటల్లో పోషకాలు తగ్గుముఖ.. ప్రజారోగ్యం గాలిలో దీపం..నిర్లక్ష్యం వీడకపోతే ప్రమాదమే!? మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హరిత విప్లవం మూలంగా ఏడున్నర దశాబ్దాల కాలంలో వ్యవసాయ(సేద్య)రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వివిధ పంటల్లో నూతన వంగడాలరాకతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఆకలి మంటల్లో అలమటించిన భారతావని తలరాతనుమార్చేసింది.1961లో,దేశంలో 72.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి […]

More

ఆపత్కాలంలో పార్టీల సమిష్టి బాధ్యత ఏది !

తెలుగు రాష్ట్రాలలో నింగి నేల ఏకం చేసేలా కురిసిన కుండపోత వర్షాల వలన ప్రజలను బయట అడుగు పెట్టనివ్వలేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి మంచి నీళ్లు లేవు. ఒక్కసారిగా మహోగ్రరూపం దాల్చిన జల ప్రళయ బీభత్సంతో రెండు రాష్ట్రాల్లోని వరద ప్రాంతాల బాధిత జనం కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో రక్షణ శిబిరాలకు తరలారు. ఆ ప్రజల కష్టాలు, పాట్లు మాటలకందనంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ విలయతాండవం మూలంగా రెక్కాడితే డొక్కాడని పేదలు, చిన్న, సన్న […]

More

గురువు బోధనలే జ్ఞాన విత్తనాలు..

విశ్వ సౌభాగ్యానికి పట్టుకొమ్మ, సమాజ జీవనానికి చుక్కాని గురువు.. గురువు బోధనలను శ్రద్ధతో విని, ఆచరించిన వాడే ఉన్నత స్థితికి చేరుతాడు.. విద్యారంగంలో ప్రజల భాగస్వామ్యం పేరుతో రాజకీయాలు చొరబడటం వల్లనే విలువలు పతనం.. “ఎండలో మాడి చల్లటి నీడను, ప్రాణవాయువును” ఇచ్చే తరువులాంటి వాడు గురువు. గాడి తప్పుతున్న సమాజాన్ని సన్మార్గంలో ప్రయాణింప చేయాల్సిందే.. ఆచార్యులను గౌరవిస్తేనే సమాజానికి ఉన్నతి.. ప్రపంచాన్ని నాగరికత వైపు నడిపించే సాధనం “చదువు” ఒక్కటే. ఈ చదువును బోధించే “గురువు” […]

More

మహిళకు భద్రత కల్పించ లేమా!

*మహిళల మనుగడ గాలిలో దీపంగా మారింది.. *నిందితులకు శిక్ష పడుతుందనే భయం లేదు,చట్టాలు చట్టుబండలై,నేరస్తుల చుట్టాలవ్వడంతో.. *కుటుంబం,సమాజం,పాలకులు బాధ్యత వహిస్తే,సమున్నత విలువైన సమాజం సాధ్యమే.. **మహిళ ఆగ్రహిస్తే సృష్టికి, మానవజాతికి పుట్టగతులు ఉండవు.. మన దేశాన్ని “భారతమాత”గా, సమాజంలో మహిళను తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమన్నతంగా, సముచితంగా గౌరవ మర్యాదలు అందుకోవలసిన నాగరిక సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై ఇంటా,బయట కనీస భద్రత లేని తీరుతో హింస, హత్యాచారాలు, […]

More

నిరుద్యోగ పెనుభూతం!

భారతదేశ జనాభాలో 35 ఏళ్ల లోపు యువత 65 శాతం ఉన్నారు. ఈ యువ భారతానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నైపుణ్య మానవ వనరులుగా మలచడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా నిరుద్యోగం, ఉపాధి లేమి, నైపుణ్య లేమి కలిగిన యువత రేటు దేశంలో నానాటికి పెరిగిపోతుంది. మన దేశ నిరుద్యోగుల్లో 83 శాతం నిరుద్యోగ యువతదే అని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవలే ప్రకటించిన నివేదికలో తెలిపింది. దేశంలో ఏటా కోటి మందికి […]

More

జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది

‘‘స్నేహం దేవుడిచ్చిన వరం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా’’ అన్న మహాకవి వాక్యం స్నేహం యొక్క ప్రాముఖ్యతను చాటుతుంది. భారతదేశంలో రామాయణం మహాభారత కాలం నుండి స్నేహం యొక్క ప్రాధాన్యత స్నేహం యొక్క ప్రభావం సమాజంపై ఉన్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారి కోసం ప్రాణాలు సైతం సమర్పించిన ఆధారాలు ఉన్నాయి. స్నేహం అనగానే కృష్ణుడు’ కుచేలుడు రాముడు’ సుగ్రీవుడు గుర్తుకొస్తారు. అలాంటి మధురమైన స్నేహాలు మనకు జీవిత పాఠాలు […]

More

తొక్కిసలాటల్లో.. దారుణ విషాదాలు..

~~~~~~ *శాస్త్ర సాంకేతికంగా దూసుకెళ్తున్నా.. పాత రాతి యుగం నాటి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాల మరణాలు అమానుషం.. *పార్లమెంటులో “తొక్కిసలాటల్లో దారుణ విషాదాలు” పునరావృతం కాకుండా చర్చ( చర్య)లు అనివార్యం.. *ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులు ఎంత పెద్ద వారైనా కఠిన శిక్షలు విధించాలి.. *సమాజంలో చైతన్యం, వైజ్ఞానిక దృక్పథం పెంచాల్సిన బాధ్యత పాలకులదే.. ~~~~~~~ అదృష్టాలు, అద్భుతాలు అనతి కాలంలో అధికంగా సంపాదించుకోవాలనే దురాశే మానవాళిని మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాల వైపు దారి మళ్ళిస్తుంది. నేనే సర్వజ్ఞుడను అనే […]

More