~ పరిశ్రమ-కేంద్రీకృత పాఠ్యాంశాలు, సమస్య పరిష్కారంపై ప్రాధాన్యత, వాస్తవ ప్రపంచ సవాళ్లపై స్టూడియో వర్క్
~ నైపుణ్యం కలిగిన పట్టణ ప్రణాళికదారుల కోసం పెరుగుతున్న పరిశ్రమ డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో రూపొందించబడిన కోర్సులు
~ప్రతిభావంతులైన విద్యార్థులకు అందుబాటులో ప్రీ-అడ్మిషన్ స్కాలర్‌షిప్‌లు
హైదరాబాద్, 10 మార్చి 2025: CEPT విశ్వవిద్యాలయంలోని ప్లానింగ్ ఫ్యాకల్టీ (FP) 2025 సంవత్సరా నికి యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1972లో స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌గా స్థాపించ బడిన CEPT విశ్వవిద్యాలయంలోని ప్లానింగ్ ఫ్యాకల్టీ భారతదేశంలో ప్లానింగ్ విద్యలో మార్గదర్శకంగా ఉంది. FP అర్బన్ ప్లానింగ్, అర్బన్ డిజైన్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ బహుళ విభాగాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. CEPT విశ్వ విద్యాలయం NIRF ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉంది. అంతేగాకుండా ఇటీవల భారత ప్రభుత్వంచే దేశంలో అర్బన్ ప్లానింగ్, డిజైన్ కు సంబంధించి ఎక్సలెన్స్ సెంటర్‌గా గుర్తించబడింది.
భారతదేశం నేడు ముందెన్నడూ లేనంతగా పట్టణీకరణను ఎదుర్కొంటోంది. 2050 నాటికి పట్టణ జనాభా 50% మించిపోతుందని ఒక అంచనా. ఈ వేగవంతమైన వృద్ధి గణనీయమైన సవాళ్లను అందిస్తోంది. పర్యా వరణ సుస్థిరత్వాన్ని నిర్ధారిస్తూ లక్షలాది మంది కొత్త పట్టణవాసులకు తగిన గృహనిర్మాణం, మౌలిక సదు పాయాలు, అవసరమైన సేవలను అందించాల్సిన అవసరం కూడా ఉంది. CEPT విశ్వవిద్యాలయం లోని ప్రణాళిక విభాగం తదుపరి తరం పట్టణ నిపుణులకు ఈ సవాళ్లను పరిష్కరించడానికి, సుస్థిరమైన, సమాన అవకాశాలను అందించగల స్థితిస్థాపక నగరాలను సృష్టించడానికి అవగాహన కల్పించడంలో, ప్రేరేపించడం లో కీలక పాత్ర పోషిస్తోంది.
కోర్సులు మరియు ప్రవేశ వివరాలు
ఐదేళ్ల పూర్తి-సమయం బ్యాచిలర్స్ ఇన్ అర్బన్ డిజైన్ (BUD): BUD కార్యక్రమం వీధులు, కూడళ్లు, ఉద్యా నవనాలు, ఆట స్థలాలు, వాటర్ ఫ్రంట్ ప్రాంతాలు, బిల్ట్ ఫామ్స్, బ్లాక్ లేఅవుట్స్, అర్బన్ డీటేల్స్ వంటి పట్టణ ప్రదేశాల రూపకల్పనపై దృష్టి పెడుతుంది. కోర్సులు, వర్క్‌షాప్‌ల ద్వారా, విద్యార్థులు నగరాలకు చెందిన సాంకేతికత, సామాజిక నిర్మాణాలు, చరిత్ర అనే మూడు కీలక అంశాలపై అవగాహన పొందుతారు. స్టూడి యో ఎక్సర్‌సైజెస్ పట్టణ ప్రదేశాల రూపకల్పనపై పని చేయడంలో ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం లో సహాయపడతాయి.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, గ్రాడ్యుయేట్లు పలు స్థాయిలలో సంక్లిష్ట పట్టణ వ్యవస్థలను విశ్లేషించడం ద్వారా పబ్లిక్ స్పేసెస్ డిజైనర్లుగా లేదా ప్రైవేట్ రంగంలోనూ కెరీర్‌లను అన్వేషించవచ్చు.
అర్బన్ ప్లానింగ్‌లో రెండేళ్ల ఫుల్-టైమ్ మాస్టర్స్ (MUP): MUP కార్యక్రమం పట్టణ ప్రాంతాల ప్రణాళిక, అభివృద్ధిపై దృష్టి పెడుతుంది, వేగవంతమైన పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులను సిద్ధం చేస్తుంది. నిర్మాణ రూపం, భూ వినియోగం, రవాణా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక మరియు స్థిరత్వ అం శాల ఏకీకరణ అనేవి MUP కు సంబంధించి స్టూడియో ఆధారిత అభ్యాసంలో కీలకమైన భాగంగా ఉంటాయి. ఈ కార్యక్రమం విద్యార్థులు పట్టణ ప్రణాళికపై బహుళ-స్థాయి అవగాహనను అభివృద్ధి చేసుకోడానికి, వివిధ స్థాయిలలో వినూత్న సమగ్ర పరిష్కారాలను అందించడానికి విమర్శనాత్మక ఆలోచనను వర్తింపజేయడా నికి వీలు కల్పిస్తుంది.
ఈ కార్యక్రమం జాతీయ, ప్రపంచ కన్సల్టింగ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వివిధ పరిశోధన సంస్థలు, ఎన్జీఓ లలో విద్యార్థులకు కెరీర్ అవకాశాలను అందిస్తుంది. ప్రాంతీయ, నగర, జోనల్, స్థానిక స్థాయిలో వివిధ పట్ట ణీకరణ సవాళ్లను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది.
అర్బన్ హౌసింగ్‌లో రెండేళ్ల ఫుల్-టైమ్ మాస్టర్స్ (MUH): MUH ప్రోగ్రామ్ పట్టణ రియల్ ఎస్టేట్, హౌసింగ్ రంగంలో మార్కెట్ విశ్లేషణను చేపట్టగల; అభివృద్ధి వ్యూహాలు, విధానాలు, ప్రాజెక్టులను రూపొందించగల; భవన నిబంధనలు, ఆర్థికం, డిజైన్, సాంకేతిక అంశాలను సమలేఖనం చేయడం ద్వారా చట్టబద్ధమైన, ప్రో గ్రామ్ ఆధారిత ప్రణాళికలను సిద్ధం చేయగల నిపుణులను అభివృద్ధి చేయడానికి అనువర్తిత జ్ఞానం, నైపు ణ్యాలను అందించడంపై దృష్టి పెడుతుంది.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, విద్యార్థులు రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో కెరీర్ అవకాశాలను అన్వేషించవచ్చు, స్థానిక ప్రాజెక్టుల నుండి నగర స్థాయి వరకు ప్రాంతీయ స్థాయి వరకు భారతీయ, ప్రపంచ స్థాయిలలో ప్రాజెక్టులను చేపట్టవచ్చు.
అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రెండేళ్ల ఫుల్ టైమ్ మాస్టర్స్ (MUI): పెరుగుతున్న పట్టణ మౌలిక సదుపాయాల అవసరాలను సమగ్రంగా అంచనా వేయడానికి, వ్యూహాలను రూపొందించడానికి, వివిధ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలకు సమర్థవంతమైన సేవా పంపిణీ ప్రాజెక్టులను నిర్ధారించడానికి MUI కార్యక్రమం విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణను అందిస్తుంది. MUIలో, WASH (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత)లో ఆప్షనల్ మేజర్ అనేది IHE డెల్ఫ్ట్ ద్వారా మద్దతు కలిగి ఉంది. ఇది గ్లోబల్ శానిటేషన్ గ్రాడ్యుయేట్ స్కూల్‌లో భాగం.
ఈ కార్యక్రమం విద్యార్థులకు బ్లూ- గ్రీన్ (జలాశయాలు- ఉద్యానవనాల సంబంధిత) పట్టణ మౌలిక సదుపా యాలు, దాని వ్యవస్థలు, వాటి బహుళ ప్రమాణాలను విశ్లేషించగల మౌలిక సదుపాయాల నిపుణులుగా కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.
అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్‌లో రెండేళ్ల ఫుల్ టైమ్ మాస్టర్స్ (MUTS): MUTS ప్రోగ్రామ్ పట్టణ రవాణా ప్రణా ళిక, సాంకేతికత, రూపకల్పన, కార్యకలాపాలు, నిర్వహణపై సమగ్ర జ్ఞానాన్ని అందిస్తుంది. వాస్తవ ప్రపంచం లో రవాణా సమస్యలను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు అర్థం చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ సైద్ధాంతిక విశ్లేషణను ఆచరణాత్మక అనువర్తనంతో మిళితం చేస్తుంది.
ఈ కార్యక్రమం విద్యార్థులకు రవాణా నిపుణులుగా రవాణా విధాన పరిశోధన సంస్థలు, జాతీయ, ప్రపంచ రవాణా కన్సల్టింగ్ సంస్థలు, అలాగే ప్రభుత్వ సంస్థలతో కెరీర్ అవకాశాలను పొందే వీలు కల్పిస్తుంది. ఈ కెరీర్స్ నగరాల్లో రవాణా భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడే పరిష్కారాలను అభివృద్ధి చేస్తాయి.
అర్బన్ డిజైన్‌లో రెండేళ్ల ఫుల్ టైమ్ మాస్టర్స్ (MUD): MUD ప్రోగ్రామ్ పట్టణ ప్రాంతాల భౌతిక రూపాన్ని రూపొందించే అభ్యాసం. పబ్లిక్ స్పేసెస్ రూపకల్పనపై సమగ్ర జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమానికి కేం ద్రంగా ఉన్న డిజైన్ స్టూడియోలు, కొత్త పరిసరాల రూపకల్పన, పట్టణ పునరుజ్జీవనం, పబ్లిక్ స్పేసెస్ రూపకల్పనతో సహా వివిధ ప్రమాణాలను అందించే నిజ జీవిత ప్రాజెక్టుల చుట్టూ నిర్మించబడ్డాయి.
మన నగరాల నాణ్యతను మెరుగుపరచడంలో పెరుగుతున్న ఆసక్తితో, గ్రాడ్యుయేట్లు అర్బన్ డిజైనర్లుగా కెరీర్‌లను కొనసాగించవచ్చు, భౌతిక వాతావరణాన్ని బాగా రూపొందించడం ద్వారా పట్టణవాసుల దైనందిన జీవితాన్ని మెరుగుపరచవచ్చు.
CEPT విశ్వవిద్యాలయం టెక్నాలజీ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ షాలిని సిన్హా మాట్లాడుతూ, “భారతదేశం వేగంగా పట్టణీకరణ చెందుతున్న తరుణంలో, నైపుణ్యం కలిగిన పట్టణ ప్రణాళికావేత్తలు, డిజైనర్ల అవసరం చాలా ఉంది. అభివృద్ధిని మరింత సమ్మిళితం చేసేదిగా, సుస్థిరదాయకంగా చేయడానికి అవసరమైన జ్ఞానం, నైపు ణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం ద్వారా మన వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఎదుర్కొం టున్న సవాళ్లను పరిష్కరించడంలో CEPT విశ్వవిద్యాలయంలోని ప్రణాళిక విభాగం ముందంజలో ఉంది. మా ప్రణాళిక- పట్టణ రూపకల్పన కార్యక్రమాలు పరిశ్రమ-కేంద్రీకృత పాఠ్యాంశాలతో రూపొందించబడ్డాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న వృత్తిపరమైన ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో గ్రాడ్యుయేట్‌లను సన్నద్ధం చేస్తాయి. మా బోధనా విధానం సమస్య పరిష్కారంపై కేంద్రీకృతమై ఉంటుంది, ఆచరణాత్మక స్టూడియో ఎక్సర్ సైజెస్ ద్వారా విద్యార్థులు వాస్తవ ప్రపంచ సవాళ్లను, సంక్లిష్టత లను గ్రహించి పరిష్కరించడానికి సహాయపడుతుంది’’ అని అన్నారు.