ఆందోళన వ్యక్తం చేసిన జపాన్
తైపీ : స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్ చుట్టూ 153 చైనా మిలిటరీ విమానాలు చక్కర్లు కొట్టినట్లుగా తైవాన్ రక్షణశాఖ వెల్లడిరచింది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు తైవాన్‌ను చుట్టుముట్టి న విమానాల వివరాలను రికార్డు చేసినట్లు పేర్కొంది. 25 గంటల వ్యవధిలో చైనా నౌకాదశానికి చెందిన 14 నౌకలను నమోదుచేసినట్లుగా తెలిపింది. ఇది అసమంజసమని, సహేతుకం కాదని, రెచ్చగొట్టే చర్యలా ఉందని రక్షణశాఖ ఉన్నతాధికారులు చైనాపై మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా ఒకేరోజు యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించలేదన్నారు. కాగా తమ దేశానికి చెందిన యోనాగుని ద్వీపం సవిూపంలో చైనా కసరత్తులు చేపట్టడంపై జపాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. చైనా చేపడుతున్న చర్యలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని జపాన్ డిప్యూటీ చీఫ్ కేబినెట్ సెక్రటరీ కజుహికో అయోకి తెలిపారు. ఈ ఘటనపై తాజాగా అమెరికా స్పందించింది. చైనా చేపట్టిన చర్యల వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడిరది. బీజింగ్ సంయమనంతో వ్యవహరించాలని పేర్కొంది. చైనా సోమవారం తైవాన్ చుట్టూ ఆర్మీ, నేవీ, వాయుసేన, క్షిపణి బలగాలను మోహరించి, భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను రంగంలోకి దించింది. పొరుగుదేశాన్ని దాదాపు అన్నివైపుల నుంచి దిగ్బంధించినట్లుగా రోజంతా కొనసాగించిన యుద్ధ విన్యాసాలను సాయంత్రానికి ముగించినట్లు చైనా సైన్యం పీఎల్‌ఏ ప్రకటించింది. ’జాయింట్ స్వార్డ్`2024బి’ పేరుతో నిర్వహించిన సవిూకృత సంయుక్త విన్యాసాల్లో అన్ని విభాగాల శక్తి సామర్థ్యాలను పరీక్షించినట్లు పీఎల్‌ఏ అధికార ప్రతినిధి, సీనియర్ కెప్టెన్ లీ షీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ భారీ విన్యాసాలను తైవాన్‌కు హెచ్చరికగా అభివర్ణించారు. ఐదు రోజుల క్రితం జరిగిన తైవాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు లై చింగ్ ప్రసంగిస్తూ ’తైవాన్ ఏ దేశానికీ అధీనం కాదు’ అని చేసిన వ్యాఖ్యలకు హెచ్చరికగా ఈ చర్యలు చేపట్టినట్లు చైనా సీనియర్ అధికారి పేర్కొన్నారు.