సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీటీడీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి లక్షలాదిగా వచ్చిన భక్తులకు…. ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో టీటీడీ సఫలీకృతమైందన్నారు. పవిత్ర దినాల్లో తిరుమలకు మరింతగా పోటెత్తే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి చక్కని దర్శన భాగ్యం అందించేందుకు టీటీడీ చేస్తున్న కృషిని చంద్రబాబునాయుడు అభినందించారు.
