దేశంలో అలజడి రేపే కుట్ర

జాతీయం

రామేశ్వరం కేఫ్‌ పేలుడులో చార్జిషీట్‌
బెంగళూరు : మార్చి మూడో తేదీన బెంగళూరలోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో నలుగురు ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ముసావిర్‌ హుస్సేన్‌ సాజిబ్‌, అబ్దుల్‌ మత్తీన్‌ తాహా, మాజ్‌ మునీర్‌ అహ్మద్‌, ముజామ్మిల్‌ షరీఫ్‌గా ఈ నలుగుర్ని గుర్తించారు. పేలుడు జరిగిన తర్వాత ఉగ్రవాత కోణం ఉందని బయటపడటంతో కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ .. చార్జిషీటు దాఖలు చేసింది. ఈ నలుగురు దేశంలో అలజడి రేపాలన్న చాలా పెద్ద ప్లాన్‌ తోనే ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించారని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ తన చార్జిషీట్‌లో తెలిపింది. బెంగళూరులోని బీజేపీ కార్యాలయంపై భారీ దాడికి ప్లాన్‌ చేసినట్లుగా గుర్తించారు. రామేశ్వరం కేఫ్‌ పేలుడు తర్వాత వీరి నెట్‌ వర్క్‌ మొత్తాన్ని ఔఎం చేదించింది. నలుగుర్ని అరెస్టు చేసింది. కేఫ్‌లో బాంబు పెట్టి వెళ్తున్న సమయంలో ఓ టెర్రరిస్టు మాస్క్‌ పెట్టుకుని టోపీ పెట్టుకుని ఉన్నాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఆ పని చేశాడు. అయితే.. అత్యధునిక టెక్నాలజో ఆ నిందితుడ్ని గుర్తించారు. అతనితో అసోసియేట్‌ అయిన మరో నలుగుర్ని గుర్తించి అరెస్టు చేశారు. వీరందర్నీ ఔఎం చట్టాల కింద అరెస్టు చేయడంతో ఇప్పుడల్లా బెయిల్‌ వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. వీరి నుంచి అదనపు సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరం కేఫ్‌ అంటే.. అత్యంత బిజీగా ఉండే హోటల్‌. చాలా పెద్ద ఎత్తున ప్రజలు కేఫ్‌ కు వస్తూంటారు. నిరంతరం బిజీగా ఉండే హోటల్‌ ను టెర్రరిస్టులు టాª`గ్గంªట్‌ చేసుకున్నారు. సెక్యూరిటీ ల్యాప్స్‌ ఉండటంతో అనువుగా వాడుకున్నారు. ముగ్గురు తెర వెనుక ఉండి.. ఒకరు మాత్రమే గుర్తు పట్టకుండా వచ్చి అనుమానం రాకుండా బాంబు పెట్టి వెళ్లారు. అది టైమ్‌ బాంబుగా తర్వాత గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం పది మంది తీవ్రంగా గాయపడ్డారు మొత్తంగా శోధన జరిగి నలుగుర్ని అరెస్టు చేసి చార్జిషీటు దాఖలు చేయడంతో.. దేశంలో మరిన్ని దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *