రష్యాను ఎంచుకుంటున్న భారతీయులు
భారతీయ విద్యార్థులకు అమెరికా,కెనడా విదేశీ విద్యమీద మోజు నెమ్మదిగా తగ్గుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా,కెనడా,యుకె, ఆస్ట్రేలియా లకు ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు కొన్ని సంవత్సరాలుగా వెళ్లడం జరుగుతోంది. కెనడా ప్రభుత్వం భారత్ పట్ల వ్యతిరేకత, అమెరికాలో ట్రంప్ ఆంక్షలు,కఠినమైన వీసా నిబంధనలు,అధిక ఆర్ధిక డిమాండ్లు,తిరస్కరణలు, దౌత్య సమస్యలు తదితర కారణాలు విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య తగ్గుతున్నది.ఆయా దేశాల బదులు రష్యా,జర్మనీ,ఉబ్బెకిస్తాన్ లకు వెళ్లడం పెరిగింది.మొత్తం మీద విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతున్నది.భారతీయ విశ్వవిద్యాలయాలలో పోటీ ఎక్కువ కావడం, విదేశాల్లో ప్రోత్సాహకాలతో పాటు విద్య అనంతరం మంచి ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో విద్యార్ధులు ఆయా దేశాల్లో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2024లో విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య బాగా తగ్గింది. కెనడా వెళ్లేవారు 41 శాతం తగ్గడం విశేషం.బ్రిటన్ వెళ్లేవారి సంఖ్య 27 శాతం,అమెరికా వెళ్లే వారిసంఖ్య 13 శాతం తగ్గింది.2023లో8,92,989 భారతీయ విద్యార్థులు విదేశీ బాట పట్టగా,2024లో 7,59,064 కి తగ్గారు.అంటే సగటున 15 శాతం తగ్గింది.2024లో అమెరికా, కెనడా, బ్రిటన్ వెళ్లిన విద్యార్ధుల సంఖ్య 27 శాతం పైగా తగ్గినట్లు దౌత్య వర్గాల బ్యూరో సమాచారం.
అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం,కెనడాలో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.2023 నుంచి పరిస్థితి దిగజారడం తో కెనడా వీసా నిబంధనలు,స్టూడెంట్ పర్మిట్ నిబంధనలు కఠినతరంతో అక్కడికి వచ్చే విద్యార్ధులు సంఖ్య తగ్గింది.బ్రిటన్లో కూడా వచ్చే విద్యార్ధులపై కొత్త నిబంధనలు తెచ్చింది.ఆస్ట్రేలియా వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గుతున్నదని పార్లమెంటులో కేంద్రం విద్యాశాఖ మంత్రి ప్రకటించడం విశేషం.
2024లో 2023తోపోలిస్తేరష్యాను ఎంచుకున్న విద్యార్ధుల సంఖ్య 34 శాతం పెరిగింది.2024లో 31 వేల మంది వెళ్ళారు.అలాగే జర్మనీ, ఉబ్బెకిస్తాన్ లకు దాదాపు 10,000 మంది చొప్పున వెళ్లారు.అలాగే ఫ్రాన్స్, న్యూజిలాండ్,ఫిలిఫీన్స్ పట్ల ఆసక్తి చూపుతున్నారు.అమెరికా అనాలోచిత నిర్ణయాలు,ట్రంప్ ఆంక్షలు వల్ల అమెరికా విశ్వవిద్యాలయాలకు ఈ ఏడాది భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.రష్యాతో కొన్ని సంవత్సరాలుగా భారత్ కు ఉన్న పటిష్ట బంధంతో పాటు అక్కడి యూనివర్సిటీలు ఇచ్చే స్కాలర్ షిప్ లు విద్యార్ధులను ఆకర్షించడం కూడా ప్రధాన కారణంగా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.కెనడాలో ప్రధాని మారడం,ఆయన భారత్తో సత్ సంబంధాలు నెరుపుతామని చెప్పడం కొంత ఆశ కలిగిస్తున్నది. ఏదిఏమైనా భవిష్యత్తులో భారతీయ విద్యార్ధులకు ఉన్నతవిద్య కోసం ఎంచుకునే విషయంలో కొన్ని కష్టాలు తప్పకపోవచ్చు.కాని భారతీయ విద్యార్ధులు ఎక్కడికి వెళ్లినా డెడికేషన్ తో చదివి విద్యను పూర్తి చేయడంలో నిష్ణాతులు కావడంవల్ల దేశాలుమారినావారిఆశయంలోమార్పురాదు.
