సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నవంబర్ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
‘మా సినిమా టైంలో మట్కా, కంగువా సినిమాలు రిలీజ్‌లున్నాయి. అవి వచ్చినా సరే మా సినిమా మాదే. మాది సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాను. మేం కొత్తవాళ్లమే అయిన మంచి ఔట్ పుట్ తో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాం. థియేటర్ లో సినిమా చూశాక మంచి సినిమా తీశామనే ఫీలింగ్ మీకూ కలుగుతుంది అని నిర్మాత బాలక్రిష్ణ తెలిపారు. నవంబర్ 14న సినిమా విడుదలకాబోతుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.