‘డెవిల్‌’ సెన్సార్‌ పూర్తి

సినిమా

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తన కెరీర్‌ ప్రారంభం నుండి ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ప్రసిద్ది చెందాడు. ఈ క్రమంలో డెవిల్‌ – ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పేరుతో మరో ఆసక్తికరమైన చిత్రాన్ని తీసుకువస్తున్నాడు. ఈ చిత్రంలో సంయుక్త, మాళవిక నాయర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్‌ నామా దర్శకత్వం, నిర్మాత. డిసెంబర్‌ 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. దానికి మంచి రెస్పాన్స్‌ లభించింది. తాజాగా ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. 2 గంటల 26 నిమిషాల రన్‌ టైమ్‌తో యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. డెవిల్‌లో కళ్యాణ్‌ రామ్‌ స్టైలిష్‌గా కనిపిస్తాడు. అతని యాక్షన్‌, స్టంట్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం డ్రామా, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, ఆకట్టుకునే యాక్షన్‌తో నిండి ఉందని వర్గాలు చెబుతున్నాయి. అభిషేక్‌ పిక్చర్స్‌ డెవిల్‌ను సమర్పిస్తుంది.