ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం
వందరోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
జర్నలిస్టులకు తక్కువ ధరల్లో ఇళ్ల నిర్మాణం
హౌజింగ్ సవిూక్షలో చంద్రబాబు నిర్ణయం
సృజనక్రాంతి/అమరావతి : గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హావిూని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సవిూక్షలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం నాడు హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి సవిూక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులకు సీఎం సూచనలు, సలహాలు చేశారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణ యించారు. సమావేశం అనంతరం మంత్రి పార్ధసారధి విూడియాకు పలు కీలక విషయాలు వెల్లడిరచారు. గ్రామాల పరిధిలో పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇస్తామని అన్నారు. కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయనున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించాం. ఇళ్ల నిర్మాణమనేది ప్రభుత్వానికి హై ప్రయార్టీగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే వందరోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. వచ్చే ఏడాదిలోపు 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్దిదారులను పక్కన పెట్టేసింది. ఇళ్లు పూర్తి అయినా వైసీపీ ప్రభుత్వం పేమెంట్లు చెల్లించలేదు. ఇలాంటి బాధిత లబ్దిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లని ఏర్పాటు చేస్తామని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి.. తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తాం. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణశాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగింది. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తాం. జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి.. మౌలిక సదుపాయాలను కల్పించలేదు.. మా ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే రూ. 10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 2014 ` 2019 మధ్య కాలంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. గ్రామాల పరిధిలో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని.. కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే`అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణమనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు సవిూక్షలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని.. అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే రూ.10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014`2019 మధ్య కాలంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.