‘విశ్వం’లో ప్రతీదీ చాలెంజ్‌ : కావ్యథాపర్‌

సినిమా

గోపీచంద్‌, కావ్యథాపర్‌ జంటగా డైనమిక్‌ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌ లో వస్తున్న చిత్రం విశ్వం. ఈనెల 11న థియేటర్‌ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్యథాపర్‌ ‘విశ్వం’ గురించి పలు విషయాలు తెలియజేశారు. ‘విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. అన్నీ వైవిధ్యంగా వుంటాయి. మల్టీపుల్‌ లొకేషన్స్‌, నటీనటులు. దాదాపు 16 మంది కమేడియన్స్‌ ఇందులో వున్నారు. నా క్యారెక్టరే భిన్నంగా డిజైన్‌ చేశారు. దర్శకడు శ్రీనువైట్ల గారు సన్నివేశపరంగా సీన్స్‌ చెప్పి నాచేత చేయించడం అనేది పెద్ద చాలెంజింగ్‌ అనిపించింది. ఆయన అన్ని విషయాల్లో ఫర్‌ ఫెక్ట్‌గా వుంటారు. నేను కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ గా ఇందులో చేశాను. మోడ్రన్‌ గా వుండే నేటి ట్రెండ్‌కు తగిన అమ్మాయిని. కనుకనే కాస్ట్యూమ్స్‌ పరంగా చాలా కేర్‌ తీసుకోవాల్సి వచ్చింది. నాకున్న ఐడియాతోనూ, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ ఐడియాకి తోడు శ్రీనువైట్ల గారి ఐడియాతో కాస్ట్యూమ్స్‌ ధరించాను’ అని తెలిపారు. కొత్త సినిమాలు లైన్‌ లో వున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలకు సైన్‌ చేశాను. త్వరలో మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాను.