సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల ప్రకారం కూల్చివేతలు
కేంద్ర సాయం కోసం ప్రధానిని కలుస్తా
ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
పువ్వాడ ఆక్రమణలపై హరీశ్ స్పందించాలి
ఖమ్మంలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి
ఖమ్మం : చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగన్నంత ఉపద్రవం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి చెరువులు, కుంటల ఆక్రమణలు కూడా కారణమని అన్నారు. ఖమ్మంలోనే బస చేసిన సిఎం ఉదయం విూడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. తాను ఫామ్ హౌస్ లో పడుకున్నోడిలా కాదని పరోక్షంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తాను చెప్పిందే చేస్తానని.. చేసేదే చెబుతానని వెల్లడిరచారు. తక్షణ సాయంగా బాధితుల ఇంటికి బియ్యం, ఇతర నిత్యావసరాలతో పాటు పదివేల రూపాయలు పంపిస్తున్నానని తెలిపారు. తెలంగాణకు వరదల కారణంగా రూ.5438 కోట్ల నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటుందని రేవంత్ అన్నారు. ప్రతి ఒక్క రైతును ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమెరికా పోయి కూర్చున్నోడు తలకాయ లేకుండా మాట్లాడుతుండని విమర్శించారు. ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ ద్వారా జరిగిన నష్టాన్ని వివరించానని రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్టాన్న్రి ఆదుకోవాలని ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి న్యాయం చేయాలని ప్రధాని మోదీని వెళ్లి కలుస్తానన్నారు. అనుక్షణం ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు కష్టపడుతున్నామన్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామాలకు ప్రత్యేక బృందాలను పంపుతున్నామని రేవంత్ తెలిపారు. శానిటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబం తిరిగి కోలుకునే వరకూ అండగా నిలబడతామని వెల్లడిరచారు. పక్క రాష్ట్రంతో పోల్చి చూస్తే మనం చాలా మెరుగ్గా పని చేస్తామని రేవంత్ తెలిపారు. విపత్తు నుంచి ప్రజలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని రకాల వ్యవస్థలను అప్రమత్తం చేసి ఉంచామన్నారు. పనికి మాలినోడు.. తలకాయ లేనోడు అమెరికాలో కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడని విమర్శించారు. 80,000 పుస్తకాలు చదివినోడు ఫామ్ హౌస్‌లో పడుకున్నాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే ప్రతిపక్షంలో ఉన్నోడు నోరు మెదపలేకపోతున్నాడని విమర్శించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను కనీసం కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ప్రజలు అధైర్పడాల్సిన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రభుత్వం విూకు అండగా నిలబడుతుందని రేవంత్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో వ్యవస్థలను చక్కదిద్దేందుకు ప్రణాళికా బద్ధమైన కృషి జరుగుతుందన్నారు. హైడ్రా ఆగదని.. ముందుకెళుతుందన్నారు. హైదరాబాద్ పట్టణాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవలసిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. నిపుణులు.. అనుభవజ్ఞులు.. ఇంజనీర్లతో మాట్లాడుతున్నామన్నారు. తప్పనిసరిగా హైదరాబాద్‌ను మార్చి చూపిస్తామని రేవంత్ తెలిపారు. విమర్శలు చేస్తున్న హరీష్ రావు తమ పార్ట ఈనాయకుడు పువ్వాడ ఆక్రమించిన చెరవుల కబ్జాలపై మాట్లాడాలన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం ఆక్రమణలు గుర్తించి కూల్చేస్తామని ఈ సందర్భంగా సిఎం హెచ్చరించారు. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడిరచారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.విూ వర్షం పడిరదన్నారు. ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని వివరించారు.వరదలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. భారాస నేత పువ్వాడ ఆక్రమణలపై హరీశ్ స్పందించాలని వ్యాఖ్యానించారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారని.. వాటిని తొలగించాలని ఆయనకు హరీశ్ చెప్పాలని సూచించారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ. 10వేలు ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చిట్ చాట్‌లో భాగంగా ఈ ప్రకటన చేశారు.