సెర్ఫ్ సీఈవో ఛైర్మన్‌గా 14మంది సభ్యులతో కమిటీ
హైదరాబాద్ : మూసీ నిర్వాసితుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్‌గా 14మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిర్వాసితులు అవుతున్న వారికి ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వారి విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. అయితే వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సహా వారి జీవనోపాధి కోసం కమిటీని నియమించింది. ఈ ప్రత్యేక కమిటీ మూసీ బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చన్న అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు శనివారం కాకా జయంతి సందర్భంగా మూసీ నిర్వాసితులను ఆదుకునే అంశంపై ఆయన కీలక ప్రకటన చేశారు. వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరినీ అనాధలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని రేవంత్ రెడ్డి హావిూ ఇచ్చారు. ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మొదని, వారి ఫామ్ హౌజ్‌లను కాపాడుకోవడానికే డ్రామాలాడుతున్నారని సీఎం చెప్పారు. నిర్వాసితులు అధైర్యపడొద్దని, ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మూసీ దగ్గర ఉన్న వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరంలో ఒక్క కుటుంబమే రూ.లక్ష కోట్లు మింగిందంటూ కేసీఆర్ కుటుంబం టాª`గ్గంªట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. మూసీ బాధితులు అందరినీ ఆదుకోవడానికి పట్టుమని రూ.10వేల కోట్లు కూడా కావన్నారు. పేదల కోసం పదివేల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనకాడబోదని సీఎం అన్నారు.