గంగమ్మ ఒడిలో సేదతీరిన మహాగణపతి
భక్తుల కోలాహలంతో సందడిగా సాగరతీరం
భారీగా తరలివచ్చి వీక్షించిన జనం
పోలీసుల ప్రత్యేక చర్యలతో సమయానికే నిమజ్జనోత్సవం
సృజనక్రాంతి ప్రత్యేక ప్రతినిధి
కోలాటాలు.. భజనలు.. తీన్మార్ స్టెప్పులు.. భాజాభజంత్రీలు…గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల నినా దాల మధ్యగణెశ్ నిమజ్జనం సందడిగా సాగింది. హుస్సేన్ సాగర్ పరిసరాలు పులకించాయి. ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చి వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ క్రమంలో అనుకున్న సమయానికే ఖైరతాబాద్ మహా గణెశుడి విగ్రహ నిమజ్జనం అంగరంగా వైభవంగా జరిగింది. జయజయధ్వానాల మధ్య అంతిమ పూజలు అందుకున్న ఖైరతా బాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మంగళవారం ఒంటిగంటన్నరకు పూర్తయ్యింది. ట్యాంకుబండ్‌పై నాలుగో నెంబర్ క్రేన్ ద్వారా బడా గణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి కోసం హైదరాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తాయి. మహాగణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బడా గణపతికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్ గణెషుడి శోభాయాత్ర అట్టహాసంగా, కన్నుల పండుగలా జరిగింది. గత సంవత్సరం నుంచి ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమం ముందుగానే జరుపుతున్నారు. ఖైరతాబాద్ బాద్ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ విూదుగా ట్యాంక్‌బండ్ చేరుకున్నాడు. అనంతరం వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత.. మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. నాలుగో నంబర్ క్రేన్ వద్ద లంబోధరుడిని నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ జనసంద్రంగా మారిపోయింది. భాగ్యనగరమే కాదు దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణెషుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. శిల్పి చిన్నస్వామి రాజేందర్ ఆధ్వర్యంలో లంబోధరుడుని రూపొందించారు. 200 మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణెళిషుడిని అలంకరించారు. 11రోజులపాటు మహాగణపతిని లక్షలాది మంది భక్తులు, సందర్శకులు దర్శించుకున్నారు. ఈసారి రూ.కోటి 10 లక్షల ఆదాయం సమకూరిందని నిర్వాహకులు వెల్లడిరచారు. హుండీ ద్వారా రూ.70 లక్షలు రాగా, ప్రకటనలు, హోర్డింగుల ద్వారా మరో రూ.40 లక్షలు సమకూరాయి. గణెష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నంబర్ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు.
ఇక ఉదయం నుంచే పలు ప్రాంతాల నుండి గణెశ్ విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గౌరీపుత్రుని తనయుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. సూపర్ క్రేన్ ద్వారా 70 అడుగుల మహాశక్తి గణపతిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గణెష్ నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరం సందడిగా మారింది. ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు కిక్కిరిసిపోయాయి. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. బుధవారం సాయంత్రానికి అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 25 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాలతో నిఘా తీవ్రం చేశారు. ఆకతాయిల చర్యలు అరికట్టేలా షీ టీమ్స్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. గణెష్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున గణెళిష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడిరచారు. మరోవైపు, గణెళిష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి వరకూ ఎంఎంటీఎస్ రైళ్ల అదనపు సర్వీసులను ద.మ రైల్వే నడపనుండగా.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులు నడపనుంది. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడుస్తాయని అధికారులు వెల్లడిరచారు.
