Saibaba | సాయిబాబా కారుణ్యం

ఆధ్యాత్మికం

దీపావళి ముందురోజు1910వ సంవత్సరం ధన త్రయోదశిరోజు బాబా ధుని ముందు కూర్చుని దానిలో కట్టెలు వేయుచున్నారు. ధుని బాగుగా మండుతున్నది. హఠాత్తుగా బాబా ధునిలో చేయి పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు చేయి కాలిపోయింది. అక్కడే ఉన్న మాధవుడనే నౌకరు,మాధవరావు దేశపాండే(శ్యామా)బాబావైపు పరుగెత్తుకుని వచ్చారు. శ్యామా సాయి నడుం పట్టుకుని బలంగా వెనుకకి లాగాడు. “దేవా”ఇట్లేల చేసితివని బాబా ని అడిగారు. ఏదోలోకంలో ఉన్నట్లు ఉన్న బాబా తెలివి తెచ్చుకుని “ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఊరిలో ఒక కమ్మరి స్త్రీ పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని కొలిమి ఊదుతున్నది. ఇంతలో ఆమె భర్త పిలిచాడు.బిడ్డ సంగతి మరచి ఆమె ఒక్కసారిగా లేచింది.దాంతో ఒడిలో ఉన్న బిడ్డ కొలిమిలో పడింది. వెంటనే నా చేతిని కొలిమి పెట్టి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలింది,బిడ్డ రక్షించగలిగినందుకు ఆనందంగా ఉందని”బాబా జవాబిచ్చారు.
బాబాకు చేయికాలిందనే విషయం శ్యామా ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చాందొర్కర్ బొంబాయి నుంచి పరమానంద్ అనే వైద్యుడిని షిరిడి తీసుకువచ్చారు. కాని సాయి ఆ వైద్యుడి చికిత్సచేయించుకోలేదు.ఆయన మందుల పెట్టే మూత తెరవకుండానే ఆ వైద్యుడు తిరిగివెళ్లిపోయాడు.ఈ సందర్భంగా అతనికి బాబా దర్శనం అయింది.కుష్టు రోగి భక్తుడు భాగోజి రోజూ బాబా చేతిని నేతితో తోమి కట్టుకట్టేవాడు. రోజూ కట్టుకట్టేవాడు.కొన్నిరోజులకు గాయం మానిపోయింది. అయినా ఇంకా తగ్గలేదోమోనని భాగోజి బాబా సమాధి వరకు రోజూ చేయి తోమేవాడు.తగ్గినా బాబా అతన్ని వారించేవారుకాదు. కుష్టురోగి భాగోజికి సేవ చేసే అవకాశం కల్పించడం ద్వారా బాబా అతనిని అదృష్టశాలిగా చేసారు. బాబా కారుణ్యానికి ఇవే నిజమైన ఉదాహరణలు.

  • యం.వి.రామారావు,8074129668

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *