ఏకధాటిగా కుంభవృష్టితో పలు ప్రాంతాలు నీట మునక
300 మిల్లీవిూటర్లకు పైగా వర్షపాతం నమోదు
ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీవిూటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్‌లో 314 మిల్లీవిూటర్ల వర్షం కురిసి నట్లు అధికారులు వెల్లడిరచారు. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిరది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబయి, ఠాణె, పాల్ఘర్, రాయ్‌గడ్‌లో ప్రతిరోజు దాదాపు 30లక్షల మంది సబర్బన్ లోకల్ రైలు సేవలను వినియోగించుకుంటారు. వర్షం కారణంగా ముంబయిలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ కొనసాగుతోంది. అటు స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం కూడా ముంబయిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక నిన్న ఠాణెలోని షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్టును వరద నీరు చుట్టుముట్టగా.. అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యటకులను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పాల్ఘార్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్థులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. పలు రైళ్లను సెంట్రల్ రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. ఇక భారీ వర్షాల కారణంగా ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల కురుస్తుండటంతో థానే, వాసయ్ (పాల్ఘర్), రాయ్‌గఢ్ (మహద్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సాంగ్లి, సతారా ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్‌ఎఫ్ ప్రకటించింది.