రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచిన నేపథ్యంలో ఈ రోజు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.అనంతరం మహిళల కోసం ఎర్పాటు చేసిన ఉచిత బస్సును జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు ముద్దు లచ్చి రెడ్డి,కళ్లెం నవ జీవన్ రెడ్డి,రావుల వెంకటేశ్వర్ రెడ్డి,దర్పల్లి రాజ్ శేఖర్ రెడ్డి ,హాస్పిటల్ సిబ్బంది,ఆర్.టీ.సీ సిబ్బంది,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
