చెరువుల ఆక్రమణలపై హైడ్రా దూకుడు

తెలంగాణ

పలుచోట్ల పెద్ద ఎత్తున కూల్చివేతలు
హైదరాబాద్‌ : మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో ఉంది. దీనిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిర్మించిన షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా అధికారులు చిన్న చిన్న షాపులు, హోటళ్లు కూలుస్తున్నారు. దీంతో వాటి యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ముందస్తు నోటీసులు లేకుండా పడగొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. షెడ్లలో రూ.కోట్ల విలువైన సామగ్రి ఉందని.. తీసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సున్నం చెరువు వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో ఆక్రమణలు కూల్చివేస్తోంది. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్టక్షన్ర్‌ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మతిన్‌ మాట్లాడుతూ.. కత్వా చెరువులో 20కిపైగా అనధికారిక విల్లాలను గుర్తించాం. ప్రస్తుతం 8 విల్లాలను కూలుస్తున్నాం. మిగిలిన విల్లాలను ఖాళీ చేయించి కూలుస్తాం. ఇరిగేషన్‌ శాఖ నిర్దేశిరచిన మార్కు ప్రకారం నోటీసులిచ్చి కూలుస్తామని వెల్లడిరచారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా అవిూన్‌పూర్‌ మున్సిపాలిటీలోని హెచ్‌ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *