2019 నాటికి 2024 నాటికి అదనంగా పోలైన ఓట్లు కేవలం 16లక్షలు మాత్రమే నని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన వల్ల తెలుస్తున్నది. పెరిగిన ఓట్లు మావే నని చంకలు గుద్దుకున్న వైసీపీ,టీడీపీ కూటమిలు ప్రకటించుకున్నాయి.పెరిగిన ఈ 16లక్షల ఓట్లే విజేతను నిర్ణయిండంలో కీలకపాత్ర వహించనున్నాయి.మే 13 వ తేదీన పోలైన ఓట్ల శాతం 81.86 శాతంగా నమోదైంది.పెరిగిన ఓట్లలో 12లక్షలు మహిళలే ఉన్నారు.విజయవాడ తూర్పులో అత్యధికంగా 13 శాతం పెరిగిన ఓట్లుగా నమోదైంది. అలాగే కావలి,పిఠాపురం,కుప్పం లలో ఆరు శాతం అధికంగా నమోదైనాయి. 0-7.5 మధ్య రూరల్ ప్రాంతంలో పెరిగిన ఓట్ల శాతం 124 నియోజకవర్గాలలో వివిధరకాలుగా ఉంది. ఓట్ల శాతం తగ్గిన రూరల్ నియోజకవర్గాలు 19గా ఉన్నాయి. రాజధానిగా అమరావతిని చేయాలని రెండేళ్లకు పైగా ఉద్యమం చేసిన గంటూరు జిల్లా తాడికొండలో ఓట్లశాతం గతం కంటే తగ్గడం గమనార్హం.పట్టణ ప్రాంతాల్లో ఓట్లు పెరిగిన నియోజకవర్గాల 27 వరకూ ఉన్నాయి.వాటిలో పోలైన శాతం 0-13 వరకూ ఉంది.గతంలో కంటే తగ్గినది 5 నియోజక వర్గాలు ఉన్నాయి.2019లో మహిళల ఓట్ల శాతం 79.6 శాతం కాగా,2024 లో 80.3 శాతంగా పెరిగాయి. 2014లో టీడీపీ,బీజేపీ,జనసేన కలసి పోటీ చేసాయి.జనసేన కేవలం మద్దతు ఇచ్చింది కాని ఎన్నికల్లో చేయలేదు.2019లో ఈ మూడు పార్టీలు ఒంటరిగా పోటీ చేసాయి.జనసేన 38 స్థానాల్లో ఓట్లు చీల్చింది.కేవలం ఓకే ఒక్క స్థానంలో గెలిచినది.టీడీపీ 23 స్థానాలలో గెలిచింది.వైసీపీ 151 స్థానాలలో విజయం సాధించింది.10వేల ఓట్ల తేడాతో 2014లో గెలిచినవి 85 స్థానాలు ఉన్నాయి.అదే 2019 లో 10వేల ఓట్ల తేడాతో గెలిచినది 45 మాత్రమే.వాటిలో 21 స్థానాలు కీలకమైనవి. ప్రాంతాల వారీగా 2019 ఎన్నికల్లో వైసీపీ,జనసేన,టీడీపీలకు వచ్చిన ఓట్ల శాతం పరిశీలిద్దాం.టీడీపీకి38.7,జనసేనకు 5.3,వైసీపీకీ 47.1శాతం ఓట్లు వచ్చాయి.కోస్తాలో(ప్రకా శం,నెల్లూరు జిల్లాల్లో)టీడీపీకి40.5,జనసేనకు1.74,వైసీపీకి53.02 శాతం వచ్చాయి.గోదావరిజిల్లాల్లో టీడీపీకి 35.9,జనసేనకు13.4,వైసీపీకి 44.6 శాతంగా వచ్చాయి.కృష్ణా,గుంటూరు జిల్లాల్లో టీడీపీకి 47.6,జనసేనకు5.6,వైసీపీకీ41.3 శాతంగా పోలైనాయి. ఇక రాయలసీమలో టీడీపీకి 38.06,వైసీపీకి 54.01శాతంగా వచ్చాయి.జనసేనకు ఒకటి కంటే తక్కువ వచ్చాయి. దీనిని బట్టి ఉత్తరాంధ్ర, రాయలసీమలలో వైసీపీ బలంగా ఉందని తెలుస్తున్నది.గోదావరి,కోస్తాలలో కూడా వైసీపీకే ఓట్ల శాతం అధికంగా ఉంది.కృష్ణా,గుంటూరులో మాత్రమే టీడీపీకి అధికంగా వచ్చింది. ఈ సారి అన్ని జిల్లాల్లో ఓట్ల శాతం ఈ పార్టీల మధ్య మారే అవకాశం ఉంది.ఎందుకంటే 2024లో టీడీపీ,జనసేన,బీజేపీలు కలసి పోటీ చేసాయి.2014లో ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేయడంతో రాయల సీమ మినహా అన్ని చోట్లా వైసీపీ కన్నా ఎక్కువ శాతం వచ్చాయి. 2024 ఎన్నికల్లో ఏపీ ఓటర్లు 4,14, 01,887 కోట్లమందిగా ఉన్నారు.వారిలో మహిళలు2,10,58,615 మంది,3421 మంది ట్రాన్స్ జండాలు ఉన్నారు. పురుషులు2,03,39,851 మంది ఉన్నారు.46389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.25 లోక్ సభ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు 175అసెంబ్లీ నియోజకవర్గాలలో 2387మంది అభ్యర్థులు పోటీ చేసారు.1.60లక్షల ఈవీఎంలను ఉపయోగించారు. వాటిని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు.జూన్ 4వ తేదీన అభ్యర్థుల జాతకాలు వెల్లడవుతాయి.
(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)