పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళా షూటర్ మను భాకర్ కాంస్య పతకంతో సత్తా చాటింది. 20 ఏళ్ల తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన మను భాకర్ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించి మూడో స్థానంలో నిలిచింది. దాంతో కాంస్య పతకాన్ని అందుకుంది. ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. జిన్ ఓయే 243.2 స్కోర్‌తో టాప్‌లో నిలవగా, కిమ్ యెజి 241.3 స్కోర్‌తో మను భాకర్ కంటే మందుంజలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో మను భాకర్ మహిళల 25మీ. పిస్టల్ ఈవెంట్‌తో పాటు, 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్, 10మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లలో పోటీపడుతోంది. మను భాకర్ కాంస్యంతో షూటింగ్‌లో ఇప్పటి వరకు భారత్ ఒలింపిక్స్ మెడల్స్ సంఖ్య ఐదుకు చేరింది. దేశానికి తొలి పతకాన్ని అందించిన మను భాకర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.