ఫలించని దిద్దుబాటు చర్యలు
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు పతనం అవుతోంది. ఇది మరింతగా అగాథంలోకి పడిపోతోంది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డాలర్ విలువ రూ.83.47కు చేరువయ్యింది. రికార్డు స్థాయికి చేరిన మన విదేశీ మారక నిల్వలు ఇప్పుడు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. రూపాయి అదుపునకు ఆర్బీఐ యధేచ్చగా డాలర్లను వెదజల్లడం, విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లను తరలించుకుపోవడంతో ఇప్పుడు మన వద్ద ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయన్న ఆందోళన కూడా ఉంది. ఇలా ఒకదాని వల్ల మరొకటి పెరిగిపోవడం, తద్వారా రూపాయి మరింత క్షీణించడం, ధరలు ఆకాశాన్నం టడం చకచకా జరిగిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆల్‌టైం రికార్డ్ గా చూడాలి. డాలర్ మారకంలో రూపాయి విలువ రికార్డు కనిష్టస్థాయికి పడిపోయి రూ.83.47 వైపు చూస్తున్నది. కరెన్సీ పతనంతో పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, పప్పులు తదితరాల ధరలన్నీ ఆకాశాన్ని తాకాయి. రూపాయి పతనాన్ని నిలువరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. 2014కు ముందు బిజెపి అధికారంలోకి రాకముందు.. డాలర్‌తో రూపాయి విలువ 68కి పడిపోతే నరేంద్ర మోడీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఐసియులో పడిపోయిందని.. తాము అధికారంలోకి వస్తే దేశీయ కరెన్సీని ప్రపంచ మార్కెట్‌లో నిలదొక్కుకునేలా చేస్తామని అనేక గొప్పలు చెప్పారు. ప్రస్తుతం అంతకంటే దారుణమైన స్థితిలోకి రూపాయి పడిపోతున్న ప్పటికీ.. కట్టడి చర్యలు కానరావడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. దేశీయ గణంకాలు బలహీనంగా చోటు చేసుకో వడానికి తోడు అంతర్జాతీయం గా డాలర్ విలువ పెరగడం రూపాయిని ఒత్తిడికి గురి చేసిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది జూన్‌లో భారత ఎగుమతుల కంటే దిగుమతులు అధికంగా చోటు చేసుకోవడం.. రికార్డ్ స్థాయిలో వాణిజ్య లోటు పడటంతో రూపాయిపై మరింత ఒత్తిడి చోటు చేసుకుంది. డాలర్‌తో రూపాయి విలువ ఇంతటితోనే ఆగుద్దని అనుకోవడానికి లేదని ఆర్థికనిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌లోనూ మందగమన భయాలు, అధిక చమురు ధరలు, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, ఎఫ్‌ఐఐలు వరుసగా తరలిపోవడం, ఆర్‌బిఐ వద్ద మారకం నిల్వలు తగ్గిపోవడం తదితర అంశాలు రూపాయిని కుదేలు చేస్తున్నాయి. రూపాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో దిగుమతి ఆధారిత అనేక ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. చమురు ధరలు ఎగిసిపడనున్నాయి. అధిక ధరలతో ఇప్పటికే ప్రజలు తీవ్ర బెంబేలెత్తుతున్నారు. విదేశీ అప్పులు తీవ్ర భారం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మరింత పన్నుల భారాన్ని మోపనుంది. ద్రవ్యోల్బణం ఎగిసిపడనుంది. వృద్థి రేటుపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ చర్యలను కట్టి చేసేందుకు ఆర్థిక ప్రణాళికలు అవసరం. విదేశాల నుంచి దిగుమతలుపై కఠిన ఆంక్షలు విధించాల్సిందే. అలాగే మన పంట విధానాలను సవిూక్షించి ఎగుమతులను ప్రోత్సహించాలి. కరెంట్ ఖాతా లోటు, వాణిజ్య లోటు వాటి లోతెంతో చూపిస్తున్నాయి. విదేశీ రుణం పెరిగి పోయింది. రూపాయి నిలువునా పతనమయ్యింది. వీటికితోడు చమురు, పెట్రో కంపెనీలపై రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని తెచ్చేందుకు పన్నులు వడ్డించారు. బంగారంపై సుంకాలు వేసి ధరలు పెంచేశారు. జీఎస్టీ మినహాయింపులో ఉన్న నిత్యావసరాలపై కూడా పన్ను వేశారు. ఆర్థిక మంత్రి చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికిది ఇప్పుడు అసాధరణ పరిస్థితే. ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిన పెట్టాలో దిక్కుతోచని స్థితి ఏర్పడిరది. వచ్చే కొద్ది నెలల్లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మాంద్యంలో చిక్కుకొంటే, భారత ఆర్థిక వ్యవస్థ సైతం తీవ్ర సంక్షోభంలోకి జారుకొం టుందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకింగ్, కరెన్సీ, రుణ సంక్షోభాలు ముంచెత్తుతాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వృద్ధి రేటు కుప్పకూలు తుందని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు.
