ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : రేషన్ కార్డుల కోసం ఈ`శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్టాల్ర తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని పేర్కొంది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటులేదని మరోసారి స్పష్టంగా చెబుతు న్నాం. ఇక మాకు ఓపిక నశించింది. మా ఉత్తర్వులను పాటించేందుకు విూకు చివరి అవకాశం ఇస్తున్నాం. లేదంటే విూ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ వ్యవహారంపై నవంబరు 19లోగా కేంద్రం, రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని.. సర్వోన్నత న్యాయస్థానం 2020లో దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా.. ఈ`శ్రమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు కొన్ని రాష్టాల్రు మాత్రమే ఈ పక్రియను పూర్తి చేయగా.. మిగతా రాష్టాల్రు కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.